Today 3 October 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : మీరు చేసే పనులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చాకచక్యంగా వాటిని పరిష్కరించుకోవాలి. పిల్లలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు పాత స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించాలి. లేకుంటే నష్టాలపాలు అయ్యే అవకాశం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ప్రతికూల వాతావరణాలు ఉంటాయి. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు శత్రువులు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఎవరితోనైనా గొడవలు లేకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించే ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరికి కొన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా చేపట్టిన పనులను పూర్తిచేయాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా అదృష్టం వరించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి పెద్దల మద్దతు ఉంటుంది. అనవసరపు చిక్కుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా బిజీగా మారిపోతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకోకుండా లాభాలు పొందుతారు. బంధువుల నుంచి ధన సహాయాన్ని పొందుతారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా అదృష్టం వరించి అవకాశం ఉంది.