Today 3 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. వ్యాపారాలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన సమయాలు ఉండనున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాముల అండదండలు ఉండడంతో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వాదనలు ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండనున్నాయి. వీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులు విదేశాలతో వ్యాపారం చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు అవసరం పడితే ఇవ్వచ్చు. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది వ్యాపారులకు కలిసి వస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. వీటిని పరిష్కరించుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా కూడా వెంటనే పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు లాభాలను పొందుతారు.