Today 3 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండడం వల్ల అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడమే మంచిది. ఉద్యోగులు గతంలో చేసిన పనులకు ఇప్పుడు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధువుల నుంచి ధన సహాయం అందడం వల్ల వ్యాపారులకు కాస్త ఆర్థికంగా రిలీఫ్ గా ఉంటుంది. గతంలో చేసిన అప్పులను ఇప్పుడు తీరుస్తారు. కొత్త వస్తువులో కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనులు పూర్తి చేయడానికి కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. సమాజంలో గౌరవం లభించడం వల్ల రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని అప్పులను చేయాల్సి వస్తుంది. అయితే ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారులకు అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు ఇతరుల సహాయం ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఇతరుల సపోర్ట్ ఉంటుంది. దీంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్లొద్దు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. డబ్బు విషయంలో అధిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గుర్తింపు పొందుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అదనపు బాధ్యతలు ఉండడంతో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో మిగతా వారి సహాయం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . కుంభ రాశి వారికి ఈ రోజు ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రణాళికలు వేయడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. అనవసరమైన పనులకు దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఒత్తిడిని ఎదుర్కొంటారు వ్యాపారులో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు.
