Today 29 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాసిన వారికి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు వారు ఈరోజు శుభవార్తలు విననున్నారు. పాత పెట్టబడిన నుంచి లాభాలు పొందుతారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఇబ్బందులు పెట్టే పనులు చేపడతారు. వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త పనులను మొదలుపెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారి జీవితం ఈరోజు సాధారణంగా గడుస్తుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాతో పెట్టుబడులు పెడతారు. కొందరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అనేక సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు ఖర్చులను ఎక్కువగా పెడతారు. రహస్య శత్రువుల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు. సూర్యాస్తమ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో గతంలో చేపట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఖర్చులను నియంత్రించుకుంటారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు ఉండడంతో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తిచేస్తారు. వ్యాపారులకు కీలక ఒప్పందాలు జరుగుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు విదేశీ వ్యాపారం చేస్తే లాభాలు ఉండే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టే ముందు పెద్దలను సంప్రదించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఉన్నత విద్య కోసం ఇతర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారు ఈ రోజు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల పట్ల విభేదాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తను వింటారు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు కావలసిన పెట్టుబడును అందుతాయి. పిల్లల కెరియర్ పైకి ఎలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.