Today 29 June Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు, ఉద్యోగులు కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు అప్పు తీసుకొని ఇవ్వడానికే నిరాకరిస్తారు. దీంతో నిరాశతో ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. లేకుంటే తీవ్ర అనారోగ్యానికి గురై అవకాశం ఉంది. వ్యాపారులు పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలు సలహాలను తీసుకోవాలి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యవహరించాలి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు లక్ష్యం పైన దృష్టి పెట్టాలి. ఇతర అడ్డంకులు ఏర్పడిన ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో రహసాలను పంచుకోవద్దు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తాయి. ఇవి వ్యాపార లాభాలను తీసుకొస్తాయి. కొత్తగా వ్యాపార సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇవి అంతర్జాతీయంగా కూడా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడితే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు చేసే పనులకు గుర్తింపు వస్తుంది. కార్యాలయాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. దినచర్యలో మార్పులు కోరుకుంటారు. కొన్ని విషయాల పట్ల నిరాశ చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏ చిన్న అనుమానం ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే ఇది పెద్ద సమస్యను తీసుకువస్తుంది. వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను కొత్త వ్యక్తులకు పంచుకోవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం వారు సహాయం చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. అయినా సరే అనుకున్న పనిని పూర్తి చేయాలి. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించాలి. ఇతరులకు అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుకడుగు వేయాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకుంటే అవి దీర్ఘకాలంగా కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా వ్యవహరించాలి. ఈరోజు విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న నిర్లక్ష్యం ఉన్న ఇబ్బందులకు గురవుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడితే వాటి నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే ఇవి లాభాలు ఉంటాయి. ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు సమాజంలో గుర్తింపును పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అయితే కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే మంచిది. స్నేహితులతో సరదాగా శిఖాలు కొడతారు. ముఖ్యమైన సమాచారాన్ని బయటపెట్టకుండా ఉండడమే మంచిది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాటి నుండి బయటపడేందుకు జీవిత భాగస్వామి తోడు ఉంటుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి దానిపైన శ్రద్ధ వహించాలి. ఇతర జ్ఞాపకాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. తోటి వారితో భావోద్వేగాలను పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. అనుకోకుండా ఇతరులపై కోపాన్ని తెచ్చుకోవద్దు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు చేరుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. పూర్వీకుల ఆర్తి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు బయటపడతాయి. కొందరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో కొత్త వ్యక్తులకు ఎలాంటి ఆర్థిక సమాచారం ఇవ్వకుండా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.