Today 29 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉండరు ఉంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరికొన్ని రాసిన వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. జీవిత భాగస్వామి కోసం ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఆటంకాలు లేకుండా తమ లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఆత్మగౌరవంతో ముందుకు సాగుతారు. అనుకున్న పలులు సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చవద్దు. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం. వీటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులకు డబ్బు విషయంలో వాగ్దానాలు ఇవ్వకూడదు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్యం పూర్తి చేయడంతో అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. పాత అప్పుల నుంచి బయట పడతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తలదురుచకుండా ఉండాలి. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. వ్యాపారులకు ఆకస్మికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యాపారులు మద్దతు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు గతంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : మీ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మనసులో కొంత ఆందోళన కలుగుతుంది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. భాగస్వాములతో చర్చిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారాలు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారు. ఉపాధి కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారికి ఆస్తుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న వివాదం నుంచి బయటపడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.