Homeఆధ్యాత్మికంToday 28 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈరోజు డబ్బు...

Today 28 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈరోజు డబ్బు ప్రవాహం.. లక్ష్మీదేవి తాండవం చేసే అవకాశం..

Today 28 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండానే ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. గతంలో ఏర్పాటు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం లభించకపోవచ్చు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు భారీగా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరి మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు చేకూరే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే చేకూరుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు తమ తెలివితేటలు ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని ప్రయోజనాలే జరిగే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇంట్లోకి అతిధుల రాకతో సందడి ఏర్పడుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యారాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైనా వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దీంతో బిజీగా మారే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. వీరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనుకోకుండా శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. పెండింగ్ పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శక్తి సామర్థ్యాల మేరకే ఖర్చులు పెట్టాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version