Today 27 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు ఉద్యోగులకు కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు అందుతాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబంలో పెద్ద సలహాలు వింటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారాలు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రశంశాలు అందుతాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపడితే వెంటనే పూర్తిచేస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సాయంత్రం కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు అడ్డంగులను తొలగించుకుంటారు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చొద్దు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించాలి. అయితే పెద్దల సలహా ఇస్తే ముందుకు వెళ్లొచ్చు. ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : రాజకీయ రంగాల్లో ఉండే వారు మాటలను నియంత్రించుకోవాలి. లేకుంటే ఎదుటివారితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోకుండా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి ఈ రోజు కలిసి వస్తుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో అప్పుడే ఆర్టిక వ్యవహారాలు జరపొద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. భాగస్వాములతో కలిసి వ్యాపార పర్యటనలు చేస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. వారి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రసంగంలో మాటల మాధుర్యాన్ని కొనసాగించాలి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్య కోసం ఇతర ప్రదేశాలకు వెళ్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అదనప ఆదాయం పొందుతారు. వ్యాపారులు జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండాలి. కొత్త వారితో జాగ్రత్తగా మాట్లాడాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా అప్పులు తీసుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం కోసం సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే కలిసి వస్తాయి. ఏవైనా వివాదాలు ఉంటే దూరంగా ఉండటమే మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి.