OG Movie Hindi Collections: నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో #RRR ,పుష్ప 2 చిత్రాలను సైతం పక్కకి నెట్టి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కల్కి, పుష్ప 2, సలార్ చిత్రాలతో పోలిస్తే తక్కువ. ఎందుకంటే వాటికి హిందీ మార్కెట్ లో భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ఓజీ చిత్రం మాత్రం కేవలం తెలుగు వెర్షన్ కి మాత్రమే పరిమితమైంది. హిందీ, తమిళం లో ఎదో నామమాత్రం గా విడుదల చేశారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తో నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునే లాగా ఒప్పందం కుదిరించుకోవడం తో, హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ లలో ఈ చిత్రం విడుదల అవ్వలేదు. అక్కడ నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో విడుదల అవ్వాలంటే కచ్చితంగా ఓటీటీ విండో 8 వారాలు ఉండాలి.
నార్త్ ఇండియన్స్ అత్యధికంగా నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఓజీ కి ఆ పరిస్థితి లేకపోవడం తో చాలా తక్కువ ఓపెనింగ్ వసూళ్లను చూడాల్సి వచ్చింది. నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం కేవలం కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. టాక్ బాగా రావడం తో నేడు ఈ చిత్రానికి మొదటి రోజు తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంటే దాదాపుగా 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నేషనల్ మల్టీప్లెక్స్ సహకారం లేకుండా, ఈ రేంజ్ జంప్ అనేది చిన్న విషయం కాదు. నిర్మాతలు ఎలాగోలా PVR , ఐనాక్స్ సంస్థలతో చర్చలు జరిపి నార్త్ ఇండియా లో గ్రాండ్ గా హిందీ వెర్షన్ ని రిలీజ్ చేయిస్తే సినిమాకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి మేకర్స్ ఫ్యాన్స్ చెప్పినట్టు వింటారా లేదా అనేది చూడాలి.