Homeఆధ్యాత్మికంToday 25 February 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈరోజు అదృష్టవంతులు.. పట్టిందల్లా...

Today 25 February 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈరోజు అదృష్టవంతులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఐదు రాశుల వారికి ఈరోజు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల వాతావరణం ఉండనుంది. గతంలో పెట్టిన పెట్టబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారాలు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.. కొత్త వారితో డబ్బు వ్యవహారాలు జరుపకూడదు. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో వీరు వ్యాపారం వృద్ధి చెందుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండనుంది. పదోన్నతి విషయంలో శుభవార్త వింటారు. బంధువుల నుంచి ధన సహాయ మండుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితులతో సరదాగా ఉండగలుగుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా ఉండాలి. కట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేసే వారికి శుభ ఫలితాలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఇంట్లో జరిగే శుభకార్యం కోసం సందడిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సమస్యలు తొలగిపోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు కొత్తగా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులు అదనపు ప్రాజెక్టులు చేపట్టడంతో ఉత్సాహంగా పనిచేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన దాని నుంచి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకున్న పనులను పూర్తి చేయడానికి తోటి వారి మద్దతు ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగులకు అదరపు ఆదాయ వనరులు సమకూరుతాయి. అప్పులన్నీ తీరిపోతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త పెట్టుబడును పెడతారు. వీరికి పెద్దల అండ ఉంటుంది. మార్కెటింగ్ రంగంలోని వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాలి. చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమవుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular