Homeఆధ్యాత్మికంToday 24 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు లక్ష్మీదేవి...

Today 24 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం..

Today 24 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై లక్ష్మీ కటాక్షం ఉండడంతో అనుకున్న పనుల సకాలంలో పూర్తయి సంతోషంగా గడుపుతారు. మరికొన్ని రాసిన వారు ఈ రోజు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. దీంతో ఉద్యోగులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలవుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరగనుంది. దీంతో సందడి వాతావరణం నెలకొంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సాధారణ లాభాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎవరితోనైనా డబ్బు వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధిక ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తను పొందుతారు. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడును వస్తాయి. పెద్దల అండదండలతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాలు వస్తాయి. గతంలో మొదలుపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి కావడానికి ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అన్ని ఆర్థిక విజయాలే ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణము ఉండడంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఏదైనా వివాదాలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొత్తగా పెట్టుబడును పెట్టిన వారికి అధిక లాభాలు వస్తాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ప్రభుత్వం ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణముంటుంది. ఉద్యోగులకు అదనపు అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఏదైనా కొత్త ఆస్తిని అమ్మాలంటే కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కెరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular