spot_img
Homeఆధ్యాత్మికంToday 23 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు గుడ్ న్యూస్.....

Today 23 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు గుడ్ న్యూస్.. డబ్బు ప్రవాహం ఉండడంతో ఫుల్ హ్యాపీ..

Today 23 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మందుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దీంతో కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మాటల్లో మాధుర్యం కనిపించాలి. అవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో ప్రారంభించిన పనులు ఈరోజు పూర్తవుతాయి. దీంతో సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి వ్యాపారులకు మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. అనుకోకుండా ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. అయితే కొత్తగా చేపట్టిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పలులు చేపట్టే ముందు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు ఉంటాయి. ఆచితూచి ఖర్చులు చేయాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు గ్రహాల అనుగ్రహంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితుల సహాయంతో ధన సహాయం పొందుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పదోన్నతి పొందే అవకాశాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల అనుగ్రహం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో సమయానికి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెడితే వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ అందుతుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనాలు పొందుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. మాటల్లో మాధుర్యం కనిపించకపోతే అవమానాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రాకుండా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper