Homeఆధ్యాత్మికంToday 23 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభయోగం..

Today 23 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభయోగం..

Today 23 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ఈరోజు ధన లాభం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధికారుల మద్దతుతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పెద్దల ఆశీస్సులతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు. కొన్ని విజయాలు సాధించాలంటే కష్టాల నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందడంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని అదనపు బాధ్యతల కారణంగా ఉద్యోగులు బిజీగా మారుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పెద్దల అండదండలు ఉండడంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొన్ని పనుల నిమిత్తం అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. దూరపు బంధువుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితుల సహకారంతో అప్పులు తీరే అవకాశం ఏర్పడుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వల్ల వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందుతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన వనరులు అందడంతో ప్రాజెక్ట్లను పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే గురువుల మద్దతు ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తారు. శక్తి సమాచారం మేరకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular