spot_img
Homeఆధ్యాత్మికంToday 22 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ...

Today 22 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం.. వద్దన్నా డబ్బు..

Today 22 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం పాఠశాలపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు కొన్ని సమస్యల పట్ల సంయమనం పాటించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు తమ పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను ఈరోజు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఓ కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఈ వ్యక్తితో జీవితం మారిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుగుణమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తారు. దీంతో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రియమైన వారికోసం కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను ఎక్కువగా భరించే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారుల అండదండలతో ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ప్రజలను సంప్రదించడం మంచిది

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడే అవకాశం ఉంది. ప్రియమైన వారికోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు ప్రత్యర్థుల విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఒత్తిడికి లోన అయ్యే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారు ఈ రోజు ఏ పట్టుబడులు పెట్టినా అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. కష్ట సమయంలో సంయమనం కోల్పోకుండా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులో ఈరోజు మెరుగైన లాభాలు సాధిస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version