Today 22 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకోకుండానే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అధికారుల అండదండలతో ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నటువంటి వ్యాపారులకు అధికంగా లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి నుంచి సపోర్టు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దలను సంప్రదిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బదిలీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల సంతృప్తిగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇంట్లో వారి సహాయంతో ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది. జీవిత భాగస్వామితో వాదనలో ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న విధంగా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే ఈరోజు శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతోంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు బ్యాంకింగ్ లావాదేవీలు ఎక్కువగా జరుపుతారు. అయితే కొత్త వస్తువులు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను గురువులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభించడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గెలిచే విధంగా వెళ్తారు. ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అంట దండలతో వ్యాపారులు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు.