Homeఆధ్యాత్మికంToday 18 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు వద్దన్నా...

Today 18 June 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు వద్దన్నా డబ్బు..

Today 18 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బులు ఆహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పనులు చేపట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం చాలా అవసరం. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారు పెద్దలను సంప్రదిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం ఉంటుంది. దీంతో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుడుమ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలి. గ్రహాలు అనుకూలతలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు ఉద్యోగులు ఈరోజు పని ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు ఉండడంతో బిజీగా మారిపోతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నాణ్యమైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సలహా అవసరం. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అవసరమైన ఆర్థిక వనరులు అందుతాయి. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అవసరమైన సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆర్థిక వనరులు సమకూరుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular