Today 18 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది.. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులు భాగస్వాములతో వ్యాపార అభివృద్ధిపై చర్చలు జరుపుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రతిభ కనబరుస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తే సంయమనం మనం పాటించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబంలో సమస్యలు వస్తే మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి తోటి వారితో చర్చిస్తారు. వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పెళ్లిళ్లు చేసుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాద యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బాగుంటేనే ప్రయాణాలు చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు దూరపు దృష్టితో ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాతో పోటీ పరీక్షలో పాల్గొంటారు. వ్యాపారులకు ఈరోజు కలిసి రావడంతో లాభాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . కుటుంబ సభ్యుల్లో ఓ శుభకార్యం గురించి నిర్ణయం తీసుకుంటారు. అయితే కొందరు వీటికి అడ్డు చెప్పడంతో వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు పెద్దల సలహా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగం కోసం ఈరోజు సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి భాగస్వాములతో చర్చిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శించి అధికారుల మద్దతును పొందుతారు. దీంతో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో వీరు విజయవంతంగా పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కార్యాలయాల్లో కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. తమ పనితీరుతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కొందరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారం గురించి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఆందోళన చెందకుండా వాటి పరిష్కారానికి ఆలోచించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ప్రారంభించిన ఓ పనిలో విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఆచితూచి వ్యవహరించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈరోజు కాస్త నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఆసుపత్రులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ తో సంతోషంగా ఉండగలుగుతారు. అయితే కొందరి మనస్తత్వాలు వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. అయితే అలాంటి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి నష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులపై భాగస్వాములతో చర్చిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో భాగస్వాములు కొందరు ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పెట్టి అవకాశం ఉంది. ఉద్యోగులు సైతం కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలను వాడకూడదు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : పూర్వీకుల ఆస్తి విషయంలో ఈరోజు శుభవార్తలు వింటారు. స్పష్టమైన ఆదాయం వచ్చేందుకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు నేటితో తొలగిపోతాయి. దీంతో ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతారు. గతంలో అనుకున్న కొన్ని పనులు పూర్తవుతాయి.