Kerala migration : పుట్టిన ఊరుతో మట్టి సంబంధం ఉంటుంది. పెరిగిన వాతావరణంలో అన్యోన్యత ఉంటుంది.. చుట్టుపక్కల వారితో అనుబంధం ఉంటుంది. ఇవన్నీ తెంచుకోవడం అంటే ఊపిరిని వదిలినట్టే.. మనదేశమే కాదు.. ఏ దేశాల్లో ఉన్న వారైనా సరే అంత సులువుగా ఈ బంధాలను వదులుకోలేరు.. అది అంత సులభం కూడా కాదు..
ఉన్నత చదువులు చదివినప్పటికీ.. సరైన ఉద్యోగాలు రాక.. ఉద్యోగాల వల్ల వచ్చే వేతనాలు సరిపోక.. కుటుంబ అవసరాలు పెరిగిపోయి.. ఖర్చులు విపరీతం కావడంతో మనదేశంలో కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు ఉద్యోగం కోసం.. మెరుగైన జీవితం కోసం.. సామాజికంగా హోదా కోసం.. గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కొందరైతే ఆఫ్రికా వంటి ఖండాలకు కూడా వెళ్తున్నారు.. మనదేశంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఒక కేంద్రం ఉందంటే అది కేరళ రాష్ట్రంలో మాత్రమే..
కేరళ రాష్ట్రానికి చెందిన సినిమాలు మన దేశంతో సమాంతరంగా గల్ఫ్ దేశాలలో విడుదలవుతాయి.. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి మలయాళ అగ్ర కథానాయకులు నుంచి మొదలు పెడితే చిన్న స్థాయి నటుల వరకు తమ సినిమాల ప్రమోషన్ల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం పరిపాటి. పైగా గల్ఫ్ దేశాలలో మలయాళీలు ఏకంగా సంఘాలు కూడా కొనసాగిస్తున్నారు. అక్కడ ఆలయాలు కూడా నిర్మిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో నిమిష లాంటి ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. అరదుగా మాత్రమే ఇటువంటి దారుణాలలో చిక్కుకున్నవారు బయటపడతారు. మిగతా మంది అక్కడ చట్టాలకు బలవుతుంటారు..
కేరళ నుంచి ఎక్కువగా నర్సింగ్, నిర్మాణరంగం లో పనిచేయడానికి వెళుతుంటారు.. గల్ఫ్ దేశాలలో చట్టాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే సమయంలో కఠినంగా కూడా ఉంటాయి. మన ప్రమేయం లేకపోయినప్పటికీ ఏదైనా జరిగితే దోషులుగా చిత్రీకరిస్తారు. పైగా అక్కడ మనకంటూ ఎవరూ ఉండకపోవడం వల్ల బాధను వినేవాడు ఉండడు.. అక్కడ న్యాయస్థానాలు కూడా పోలీసులు చెప్పింది గుడ్డిగా వింటాయి. మరో మాటకు తావు లేకుండా మరణశిక్షనే విధిస్తుంటాయి. ఇండియన్స్ అంటే అక్కడివారికి ఉండే చులకన భావం కూడా ఒక కారణం. అందువల్లే గల్ఫ్ దేశాలలో మనవాళ్లు చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతుంటారు.
అంత ఇబ్బందులు పడుకుంటూ అక్కడ ఉండడానికి ప్రధాన కారణం.. మన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు స్వదేశంలో బాగో లేకపోవడమే.. పైగా అక్కడి కరెన్సీ కి విలువ ఎక్కువగా ఉంటుంది. స్వదేశంలో ఆర్థిక కష్టాలు.. కుటుంబ నిర్వహణ.. సామాజిక హోదా.. ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించడం.. ఇలాంటి అనేక కారణాలతో చాలామంది గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు.. అక్కడ కరెన్సీకి విలువ అధికంగా ఉండడం.. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడం వల్ల కేరళ వాసులు గల్ఫ్ దేశాలకు ప్రయాణం సాగిస్తుంటారు.
గల్ఫ్ దేశాలలో చెప్పుకున్నంత స్థాయిలో అవకాశాలు ఉండవు. అక్కడ నిబంధనలు, చట్టాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అక్కడ ప్రభుత్వాలు వేసే శిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.. మన ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదాలైనప్పటికీ దోషులుగానే చిత్రీకరిస్తారు. భారత దౌత్య విభాగం రంగ ప్రవేశం చేసేదాకా బయట ప్రపంచానికి ఈ విషయాలను చెప్పరు. పైగా జైళ్లల్లో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంటారు.. ఇవన్నీ కూడా సగటు భారతీయులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.. అన్ని ఇబ్బందులు పడుతూ కూడా మన వాళ్లు అక్కడ ఉండడానికి ప్రధాన కారణం సమస్యలే.
ఇండియాలో అంతగా అవకాశాలు లేకపోవడం.. ఉన్న అవకాశాలలో వేతనాలు తక్కువగా ఉండడం.. కుటుంబ అవసరాలు విపరీతంగా ఉండడం.. ఇవన్నీ కూడా భారతీయులను గల్ఫ్ దేశాల నుంచి తిరిగి రానివ్వకుండా చేస్తున్నాయి.. నిమిష ప్రియ లాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అరదుగా మాత్రమే ఉన్నత స్థాయిలో స్పందనలు ఉంటున్నాయి. అది కూడా అంతగా పరిష్కార మార్గాన్ని చూపడం లేదు.
నిమిష ప్రియ ఉదంతాన్నే పరిశీలనకు తీసుకుంటే.. క్షమా ధనాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. మరణ శిక్షణ విధించాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి నిమిష ప్రియ తాను వెళ్లిన దేశంలో క్లినిక్ ఏర్పాటు చేసింది. దాని భాగస్వామ్య వ్యవహరించిన యెమెన్ దేశపు వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. గత్యంతరం లేక ఆమె మత్తు ఇంజక్షన్ వేసి అతడి నుంచి తప్పించుకుంది. ఒకవేళ ఆమె గనుక ఆ చర్యకు పాల్పడకపోతే ఏమి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె తన స్వీయ రక్షణా ర్థం చేసిన పనిని అక్కడి ప్రభుత్వం తప్పుగా భావిస్తోంది. పోలీసులు కూడా ఆమెను నిర్బంధంలోకి తీసుకొని దోషిగా చిత్రీకరించారు.. అక్కడి కోర్టు కూడా ఆమెకు మరణ దండన విధించింది.
వాస్తవానికి గల్ఫ్ దేశాలలో చట్టాలు అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ వారు తప్పు చేసినప్పటికీ రక్షించడానికి అనేక వ్యవస్థలు అండగా ఉంటాయి. కానీ ఇతర దేశస్తులు ముఖ్యంగా భారతీయుల విషయంలో అక్కడి ప్రభుత్వాలు, అధికారులు దారుణంగా వ్యవహరిస్తారని అనేక ఉదంతాలు తెలియజేశాయి.. నిమిషప్రియ ఉదంతం నేపథ్యంలో ఓ ప్రఖ్యాత ఆంగ్ల పత్రికకు తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిధరూర్ ఒక సంపాదకీయ వ్యాసం రాశారు.. అందులో గల్ఫ్ దేశాలలో ఉండే బాధలను ఆయన ఏ కరువు పెట్టారు. ఒక పార్లమెంటు సభ్యుడు ఆ స్థాయిలో స్పందించి రాశాడు అంటే.. ఆ దేశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.