Today 17 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండగా.. మరికొన్ని రాశుల వారు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వీరికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో లేదా వ్యాపారాల్లో తమకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రయోజనాలు పొందుతారు. కొత్త పరిచయాలు లాభాలు తెచ్చి పెడతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యాపారం కోసం సన్నాహాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వీరికి గ్రహాల అనుకూలత ఉండటం వల్ల ఇంట్లో అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. స్నేహితుల సంపూర్ణ మద్దతుతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఉండడంతో అన్ని పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. ఏదైనా శుభకార్యం నిర్వహించాలని అనుకుంటే కుటుంబ సభ్యుల మద్దతు పొందాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు సమస్యల నుంచి బయటపడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీనా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడానికి ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.