Today 17 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. గురువారం ద్వాదశరాశులపై రేవతి నక్షత్రం ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని రాశుల ఉద్యోగులు శుభవార్తలు వింటారు. 12 రాశుల ఫలితాలు ఈరోజు ఎలా ఉంటాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) ఈరోజు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్లతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. అయితే వారితో మాట్లాడే సమయంలో వాదనలకు దిగకుండా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే అనూహ్యంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తల్లితండ్రుల ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండదు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సమాజంలో కొన్ని మంచి పనులు చేయడం వల్ల మంచి గుర్తింపు వస్తుంది. వివాహ కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి సంప్రదింపులు జరుపుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయం కోసం ఆశించే వారికి శుభవార్తలు పొందుతాయి. వ్యాపారులు పెద్దల సలహాతో కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు చేపడతారు. ఇది భవిష్యత్తులో ఎంతో లాభాలను ఇస్తాయి. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం కీలకంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై కాకుండా మధ్య వాహనాలపై వెళ్లే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అప్పు కోసం బంధువులను సంప్రదిస్తారు. అయితే బ్యాంకు నుంచి రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ఏవైనా సమస్యలు వస్తే మౌనంగా ఉండడమే మంచిది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహరాశి వారు ఈరోజు దూరపు ప్రదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులు ఈరోజు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ కారణంగా అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడితే అదుపు చేయాలి. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా ఉంటారు. వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఓ ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. గతంలో అనుకున్న పనులు ఈరోజు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంట్లో సంబంధించిన రహస్యాలను బయట వ్యక్తులకు చెప్పవద్దు. ఎవరికి ఈరోజు అప్పు ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులకు కొత్త వ్యక్తులు భాగస్వాములుగా మారుతారు. అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అనుకుంటే తల్లిదండ్రుల మద్దతు ఉండాలి. ఉద్యోగులు ప్రణాళిక ప్రకారంగా పనులు చక్కపెట్టుకుంటారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు ధన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు కష్టపడాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈరోజు ఈ రాశి వారు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. కొన్ని ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాటిని చెరిపివేసి ప్రశాంతంగా ఉండగలగాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొన్ని సంస్థల నుంచి శుభవార్తలు వింటారు. డబ్బుకు సంబంధించిన ఏ వ్యవహారం అయినా ఈరోజు జాగ్రత్తగా చేయాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. దీంతో ఈరోజు వీరితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రణాళిక తో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అయితే వీరికి తోటి వారి మద్దతు ఉంటుంది. వ్యాపారులు దూరపు దృష్టితో పెట్టే పెట్టుబడులు లాబిస్తాయి. కొత్త వారితో సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు బంగారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అయితే ఇవి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన కీలక నిలయం తీసుకుంటారు. వ్యాపారులు ఇప్పటివరకు ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా ఉంటారు. కొన్ని సంస్థల నుంచి ప్రత్యేకంగా బహుమతిని పొందే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.