Today 17 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: మన దేశ ప్రెసిడెంట్ వర్షంలో.. అదే అమెరికాలో వాళ్ళ ప్రెసిడెంట్ ని వర్షంలో తడవనిస్తారా?
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : , ఈరోజు ఉద్యోగులు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అనుకున్న లాభాలు పొందుతారు. గతంలో చేపట్టిన కొన్ని పనులు పూర్తి కావడంతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాల కంటే అద్దె వాహనాల్లో ప్రయాణించడం మంచిది. సమాజంలో కొన్ని పనులు చేపట్టడం వల్ల గుర్తింపు వస్తుంది. నమ్మకమైన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరితో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అంకితభావంతో పనిచేయడం వల్ల కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఊహించిన లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సమయాన్ని వృధా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పనిని త్వరగా పూర్తి చేయడానికి అంకిత భావంతో ఉండాలి. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదుపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు చేసిన కొన్ని పనులకు ప్రశంసలు వస్తాయి. మరి కొందరికి పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి కావడంతో ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు శుభవార్తలు వింటారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తారు. దీంతో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో బ్యాంకు రుణం వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుంచి కూడా తన సహాయం అందుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడంతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరిగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కాస్త శ్రమించాల్సి ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు లక్ష్యంపై దృష్టి పెడితే విజయం సాధించే అవకాశముంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల తో సంతోషంగా ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఓ విషయంలో గొడవ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే కుటుంబ సభ్యుల మద్దతు కోసం వేచి ఉండడమే మంచిది. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఇతరులకు డబ్బు ఇవ్వకుండా ఉండడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాజు వారు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. అనుకున్న ఆదాయం రాకపోవడంతో వ్యాపారులు నిరాశతో ఉంటారు. కొత్త భాగస్వాములతో వ్యాపారం గురించి చర్చిస్తారు. అయితే ఇంట్లోని రహస్యాలు చెప్పకుండా ఉండడమే మంచిది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెంపొందుతాయి. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది.