Homeఆధ్యాత్మికంToday 17 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అపారమైన లాభాలు..

Today 17 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అపారమైన లాభాలు..

Today 17 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాసిన వారికి అనుకోకుండా అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాసిన వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలనుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు తోటి వారి సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఫలితంగా కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అన్నీ కలిసి వస్తాయి. అయితే పదోన్నతుల విషయంలో అధికారుల మద్దతు సాధించాలి. కొత్తగా అప్పు చేసే వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో తోటి వారి సహాయం ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులకు అన్ని వర్గాల వారి మద్దతు ఉంటుంది. దీంతో తమ పనులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడిన విషయంలో పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సొంత వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. గతంలో అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటినుంచి బయటపడడానికి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి. ఫలితంగా సంతోషంగా గడుపుతారు. దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. మానసికంగా దృఢంగా తయారవుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. ప్రతిభ కనబరిచే వ్యాపారులకు పదోన్నతులు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version