Today 15 November 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ద్వాదశ రాశులపై శనివారం అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు గతంలో కంటే ఎప్పుడూ లాభాలు పొందుతారు. వీరికి ఏకాదశి వేల వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయి. సాయంత్రం పాత స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడంతో బిజీగా మారిపోతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు కష్టపడి పనిచేసిన దానికి సరైన ఫలితం ఉంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. దీంతో వ్యాపారులు బిజీగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి రాజకీయాల్లో ఉంటే అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ముఖ్యమైన చర్చల్లో పాల్గొనాల్సి వస్తుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో గతంలో కంటే ఆదాయాన్ని పెంచుకుంటారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. పెద్దల సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం విజయవంతం అవుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈరోజు ఏదైనా పనిని ప్రారంభిస్తే తప్పకుండా విజయం అవుతుంది. ఏకాదశి వేళ కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. చుట్టూ ఏదైనా వివాదం ఉంటే ఈరోజు తొలగిపోతుంది. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక వాతావరణం లో పాల్గొనడంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో బిజీగా మారిపోతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు వస్తే మౌనంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయంలో వీరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. రోజువారి అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల కోసం షాపింగ్ చేస్తారు. అయితే ఆదాయాన్ని అదుపులో ఉంచుకొని ఖర్చులు చేయాలి. లేకుంటే తీవ్ర నష్టాలు పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త భాగస్వాములు చేరడంతో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. తోబుట్టువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం కలగనుంది. ఎవరికైనా ధన సహాయం చేస్తే తిరిగి చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు పూర్తి అయ్యేవరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనైనా వాదన జరిగితే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ఘననీయమైన ప్రయోజనాలు ఉండనున్నాయి.