Homeఆధ్యాత్మికంToday 12 February 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదృష్టవంతులు..

Today 12 February 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదృష్టవంతులు..

Today 12 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరగనుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే గురువులను సంప్రదించడం మంచిది. విదేశాల్లో ఉండే వారితో సత్సంబంధాలు పెరుగుతాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎవరికి తోనైనా వాదనలకు దిగకుండా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారైతే ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు అన్ని సానుకూలమైన విషయాలను వింటారు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అదనపు ఆదాయం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. ఎవరితోనైనా బాధలు చేసేటప్పుడు ఓపికతో ఉండడం అవసరం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన లాభాలు పొందుతారు. అధికారుల అండదండలు ఉండడంతో ఉద్యోగులు అదనపు లాభాలు పొందుతారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకునేవారు తోటి వారి సహకారం తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారులు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండటంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కోర్టుకు సంబంధించిన చిక్కులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. గతంలో ఆన్లైన్లో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కొన్ని సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాతోనే పెట్టుబడును పెట్టాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదరపు ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు దానధర్మాలు చేస్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం కావడంతో లాభాలపై దృష్టి పెడతారు. విద్యార్థులకు గురువుల సహకారం ఉంటుంది. దీంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. చట్టపరమైన చిక్కులు ఉంటే వాటి నుంచి బయటపడతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular