Today 11 July 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఓ రాశి వ్యాపారులకు అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. మిగతా రాశుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి చేస్తారు. వ్యాపారులు పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం తీవ్రంగా కష్టపడతారు. అయితే మానసిక బాధల నుంచి విముక్తి పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీరికి తోటి వారి మద్దతు ఉండడంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అయినా కొన్ని బాధ్యతలను విస్మరించకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. అయితే భాగస్వాములతో కొన్ని రహస్యాలు పంచుకోకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగాల వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యార్థులు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునే సమయంలో తోటి వారి మద్దతు తీసుకోవాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు వస్తాయి వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . జీవిత భాగస్వామిగా ఈరోజు సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాజు ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అందరికీ పదవ నదులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆదాయం పెరుగుతున్న ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దుబారా ఖర్చులను మినహాయించుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు గతంలో ఇచ్చిన కొన్ని మాటల ప్రకారంగా ఆర్థిక వ్యవహారాలను జరుగుతారు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులు చేపట్టిన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విద్యార్థులకు ఏరియల్ పై కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. లేకుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భాగస్వాములను సంప్రదించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనువైన సమయం కాదు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ధనస్సు రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆదాయం పెరుగుతున్న ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే భాగస్వాముల మధ్య కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : గతంలో కంటే ఈ రాశి వారి ఆదాయం ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు పాత పెట్టుబడుల నుంచి లాభాలు అధికంగా పొందుతారు. ఉద్యోగులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఏర్పడతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో కొత్త అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరి కెరీర్ పై నిర్ణయం తీసుకునే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు గతంలో కంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వ్యాపారులు అనుకోకుండా ఈరోజు లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే కొత్తగా చేరిన భాగస్వాములతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఎందుకంటే కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు తమ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.