Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై జేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈ ఐదు రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పనులు చేసేటప్పుడు కూడా చాకచక్యంగా వ్యవహరించాలి. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు బ్యాంకుతో ఆర్థిక వ్యవహారాలు జరుపుతారు. బ్యాంకు రుణం తీసుకోవాలని అనుకుంటే ఆలోచించాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామిగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రియమైన వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు సాధారణ లాభాలు పొందుతారు. కొత్త ప్రణాళికలతో ఆర్థిక వ్యవహారాలు ఊపందుకుంటాయి. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం కాస్త సమస్యలను ఎదుర్కొంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా ఉండాలి. చాలా రోజుల తర్వాత శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సంతోషంగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈ రోజు కొన్ని కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ప్రణాళికలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వారితో వ్యాపార కార్యకలాపాలపై చర్చిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదనపు ఆదాయం కోసం ఉద్యోగులు చేసే ప్రయత్నాలు పలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. విదేశాల నుంచి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన సమయం.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే అందుకోసం తీవ్రంగా కష్టపడతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) ఈ రాశి ఉద్యోగులు కొత్తగా ఏదైనా ప్రయత్నాలు ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయి. ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మాటలు మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులు కొన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మానసిక భారం నుంచి బయటపడతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం కోసం కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహాలు పాటించాలి. ఇంటికి సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు గురువుల సలహా తీసుకోవాలి.