Homeఆధ్యాత్మికంToday 1 july 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అన్ని...

Today 1 july 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే..

Today 1 july 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వ ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గజకేసరి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండి అపారమైన లాభాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు అపారమైన ప్రయోజనాలు ఉండనున్నాయి. గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను ఈరోజు వెంటనే పూర్తి చేస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గ్రహాల అనుకూలత ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల గురించి ప్రశంసలు పొందుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సూర్యగ్రహ అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్నేహితుల సహాయంతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. కొందరికి పదోన్నతులు వస్తాయి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కొందరు కావాలని అడ్డంకులు సృష్టిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. గతంలో అనుకున్న కోరికలను ఈరోజు నెరవేర్చుకుంటారు. ఆదాయం పొందడానికి మార్గాలు ఏర్పడతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఇతరులకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. పక్కా ప్రణాళికతోనే ఖర్చులు చేయాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు పై చదువుల కోసం అవకాశాలు ఏర్పడతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడడంతో అధిక లాభాలు పొందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇతరులకు డబ్బు ఇవ్వడం అంతా మంచిది కాదు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల తో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే ముందు తోటి వారి సహాయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. ప్రమోషన్ విషయంలో ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version