Tholi Ekadashi 2025: ప్రతీ ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగ చాలా పవిత్రమైనది. ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఇలా మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఏకాదశుల్లో పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ తొలి ఏకాదశి నాడు పూజిస్తే అంత ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో విష్ణువును నేడు పూజిస్తే మంచిదని, మోక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు కొన్ని నియమాలు పాటించాలి.
ఉదయాన్నే నిద్ర లేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజించాలి. పువ్వులు, పండ్లుతో పూజించి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత రాత్రిపూట జాగరణ చేయాలి. ఇలా తొలి ఏకాదశిని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు తెలియక ఈ తొలి ఏకాదశి నాడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల పాపాలు చుట్టుకుంటాయి. అన్ని పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది. అయితే పవిత్రమైన తొలి ఏకాదశ నాడు చేయకూడని పనులు ఏంటి? పొరపాటున చేస్తే దరిద్రం చుట్టుకుంటుందా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: సెలవు పెట్టకుండా రూ.2000తోనే తిరుపతి టూర్.. ఎలా స్టార్ట్ చేయాలి? ఎప్పుడు తిరిగి రావాలి?
పవిత్రమైన ఏకాదశి రోజు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొందరికి తెలియక నేడు తులసి ఆకులను తీస్తారు. అయితే తులసి ఆకులను పూజ కోసం చాలా మంది తీస్తారు. కానీ నేడు అసలు తులసి దళాలను కోయకూడదు. ముందు రోజు కోసి ఉంటే మాత్రం పూజ నిర్వహించవచ్చు. కానీ నేడు వాటిని కోసి పూజించకూడదని పండితులు చెబుతున్నారు. తులసి దేవీ మహా విష్ణువుకు ఇష్టమైనది. ఈ రోజు ప్రశాంతంగా ఉంచాలని చాలా మంది పూజలో ఉపయోగించారు. అయితే ఇంట్లో ఉన్న చీపురును నేడు బయట పడేయకూడదు. దీనివల్ల ఇంట్లో ఉన్న సంపద బయటకు వెళ్లిపోతుంది. అదృష్టం కూడా పోతుందని, అందుకే అసలు చీపురును ఈ రోజు ఇంటి బయట వేయకూడదని పండితులు చెబుతున్నారు.
Also Read: వ్యాయామం అవసరం లేదు.. 30 నిమిషాల ముద్దు చాలు..ఎందుకో తెలుసా?
కొందరు ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, సేవింగ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చేయడం వల్ల పాపం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే కోరిన కోరికలు జరగవని, అన్నింట్లో చెడు ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు. పూజ వల్ల కొందరు వేకువ జామున లేస్తారు. దీంతో పగటి పూట కొందరు నిద్రపోతారు. అయితే పగటి సమయంలో ఈ ఏకాదశి నాడు అసలు నిద్రపోకూడదని పండితులు అంటున్నారు. దీనివల్ల చెడు జరుగుతుంది. మహా విష్ణువును ధ్యానిస్తూ ఉండాలి. దీనివల్ల పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
కొందరు చిన్న విషయానికి గొడవలు పడుతుంటారు. ఒకరిపై కోపంగా ఉండటం, మాట్లాడటం, నిందలు వేయడం, గొడవలు, చిరాకు చూపించడం వంటివి చేయకూడదని పండితులు అంటున్నారు. వీటివల్ల అసలు పుణ్యం రాదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయవద్దు. నియమాలు పాటిస్తూ ఉంటే ఏడాదంతా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.