Vinayaka Chavithi 2025: ఆది పూజ అందుకునే గణనాథుడి పండుగ 2025 సంవత్సరంలో ఆగస్టు 27 నుండి ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు మండపాలను సిద్ధం చేశారు. పది రోజులపాటు విగ్నేశ్వరుడు వివిధ పూజలను అందుకోనున్నాడు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం తో భక్తులు వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనున్నారు. వినాయకుడికి పూజ చేసే సమయంలో సాధారణ పూజల కంటే ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చదవడం వల్ల స్వామివారి ఆశీస్సులు త్వరగా పొందవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వినాయక చవితి రోజు ఈ శ్లోకాన్ని చదవాలని అంటున్నారు. మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం..
వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే ఒక్కోసారి అనుకోకుండా చంద్రుడిని చూడాల్సి వస్తుంది. ఇలా పొరపాటున కూడా చంద్రుని చూసిన తర్వాత కొన్ని శ్లోకాలు చదవడం వల్ల ఆ దోషం తొలగిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మిక పండితుడు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. ఒకవేళ ఈ రోజున చంద్రుడిని చూసినట్లయితే సింహ: ప్రసేనమవధీ : సింహో జాంబవతాహత:, సుకుమారక మారోధీ: తవహ్యేషా శ్యమంతక : .. ఈ శ్లోకాన్ని చదవడం వల్ల చంద్రుడని చూసిన నిండా తొలగిపోతుందని అంటున్నారు. అయితే అంతకుముందు వినాయక వ్రతం చేసిన వారు చవితి పూజలో శమంతకోపాఖ్యానము కథ విని అక్షింతలు చల్లుకున్న కూడా ఈ దోషము తొలగిపోతుందని అంటున్నారు.
అయితే చంద్రుడికి, వినాయకుడికి మధ్య భేదం రావడానికి ఒక కారణం ఉంది. ఒకసారి వినాయకుడు తన తల్లిదండ్రులను నమస్కరించడానికి కిందికి వంగుతాడు. అయితే ఇలా కిందికి వంగలేకపోవడంతో ఇంద్రుడు చూసి నవ్వుతాడు. దీంతో పార్వతీదేవికి ఆగ్రహం వస్తుంది. దీంతో చంద్రుడిని చూస్తే నీలాపా నిందలు తప్పవని శాపం పెడుతుంది. అయితే దేవతలంతా కలిసి చంద్రుడిని చూడకుండా ఉండలేమని.. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోవాలని వేడుకుంటూ ఉంటారు. దీంతో శాంతించిన పార్వతీదేవి వినాయక చవితి రోజు మాత్రం చంద్రుడిని చూస్తే నిందలు తప్పవని అంటుంది. అయితే ఆరోజు ఈ నింద పోవాలంటే వినాయక కథ విన్న తర్వాత అక్షింతలు వేసుకోవడం ద్వారా పరిష్కారం అవుతుందని తెలుపుతుంది.
అప్పటినుంచి మనసులే కాదు దేవతలు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడానికి సహకరించలేదు. ఒకసారి శ్రీకృష్ణుడు గోవుపాలు వెతుకుతుండగా.. పాలలో చంద్రబింబం కనిపించింది. దీంతో సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడిని ఓడించి శమంతకమణిని పొందుతాడు. అయితే ఆ శమంతకమని ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఆ శమంతకమని ఇవ్వాలని సత్రజిత్తును శ్రీకృష్ణుడు కోరుతాడు. కానీ సత్రజిత్తు తిరస్కరిస్తాడు. ఇది లో ఇది ఇలా ఉండగా ఓ రోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణితో వేటకు వెళ్తాడు. దానిని చూసిన సింహం అది మాంసపు ముక్క అనుకొని ప్రసేనుడిపై దాడి చేసి శమంతకమని ఎత్తుకెళ్తుంది. అయితే ఆ నిందను ప్రసేనుడు శ్రీకృష్ణుడిపై వేస్తాడు.
ఇలా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల నిందలను ఎదుర్కొని ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేయడం ద్వారా వాటి నుంచి బయటపడ్డారు.