Vinayaka Chavithi : ప్రతీ ఏడాదిలో ఎక్కువ రోజులు జరుపుకునే వేడుక వినాయక చవితి. భాద్రపద మాసంలో చతుర్థి రోజున వినాయక చవితి ఉంటుంది. ఈరోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూంటారు. ఈ వేడుక కోసం యూత్, భక్తులు ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి రాబోతుంది. ఈ సందర్భంగా ఊరూ, వాడా మండపాలు ఇప్పటికే వెలిశాయి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి వేడుక సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాలు మారిపోతున్నాయి. గ్రహాల అనుగ్రహం సందర్భంగా ఈ రాశులపై విఘ్నేశ్వరుడి చల్లని చూపు ఉండనుంది. దీంతో వారికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. ఇంతకీ ఏ రాశుల పై వినాయకుడి చూపు ఉంటుందో చూద్దాం..
వినాయక చవితి సందర్భంగా కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఉండనున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కటుుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్స్మీ కటాక్షం ఈ రాశి వారికి ఉంటుంది. భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. విద్యార్థుల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు వింటారు. ఏదైనా ఇంటర్యూలో పాల్గొంటే సక్సెస్ అవుతారు.
కన్యా రాశిపై విఘ్నేశ్వరుడి చూపు ఉండనుంది. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయమే వరిస్తుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరి నుంచి ఊహించిన పెట్టుబడులు పొందుతారు. వీరికి జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్తవ్యక్తులు పరిచయం అవుతారు. వీరు ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతారు.
విఘ్నేశ్వరుడు చవితి సందర్భంగా తులా రాశి వారికి అనుకూలంగా ఉంటాడు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉన్నఫలంగా ఆస్తులు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. సీనియర్ల నుంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వీరికి అనుకోని లాభాలు పెరుగుతాయి. జీవితం సాఫీగా సాగుతుంది. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. బ్యాంకు రుణాలు క్లియరెన్స్ అవుతాయి.
మీన రాశిపై గణనాథుడి చల్లని చూపు ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా విజయమే వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకోని అదృష్టం వరిస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More