Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. ఇంటి నిర్మాణానికి వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్ద సలహా తీసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం. అయితే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అనుకున్న పనులలో పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటుంది. ఈ సమయంలో కొందరు చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. అనుకోకుండా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. విదేశీ పర్యటనలు చేయడానికి ప్లాన్ చేస్తారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉన్నటువంటి ఒక్కసారిగా వ్యాపారులకు లాభాలు పంట పండుతుంది. అనుకోకుండా ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : శక్తి సామర్థ్యాల మేరకు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభం వస్తుంది. వ్యాపారులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి మార్గం ఏర్పడుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలపై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఎవరితోనైనా డబ్బు వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పిల్లల కెరీర్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. అయితే సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోకుండా అలాగే ఉంటాయి. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరగడంతో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లలు, కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శత్రువుల పెడదా ఉండడం వలన కొందరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే వారికి సరైన వ్యక్తులు లభిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి ఈరోజు ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం చేసేవారు ఈరోజు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఇంటి నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెడతారు. కొత్తగా ఎవరితోనైతే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల విభేదాలు తొలగిపోతాయి. సంతోషకరమైన వాతావరణ ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.