Venkatesh : సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య… ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన మాస్ సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. నిజానికి ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుని సినిమాలుగా చేసినప్పటికి అవేవి పెద్దగా సక్సెస్ ని సాధించకపోవడంతో కేవలం నా సినిమాల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ని చూపిస్తూ వచ్చాడు. ఆ సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. ఆ సినిమాలు ఎక్కువ సక్సెస్ లను సాధిస్తున్నాయని తెలుసుకున్న బాలయ్య అప్పటి నుంచి వరుసగా ఆవే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలను అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరిసర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ ను సాధించి తన ఖాతాలో 5 సక్సెస్ ను వేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక 2000 సంవత్సరంలో ఆయన చేయాల్సిన ఒక సినిమాని విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయంలో చాలా మందికి తెలియదు. వెంకటేష్ హీరోగా ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జయం మనదేరా’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఈ సినిమాని మొదట బాలయ్య బాబుతో చేయాలని అనుకున్నారట. కానీ ఆ స్టోరీ రామానాయుడు దగ్గరికి వెళ్ళడంతో ఆ కథ ఆయనకి బాగా నచ్చిందట. ఈ సినిమాని వెంకటేష్ తో చేస్తే బాగుంటుందని వెంకటేష్ తో ఈ సినిమాని చేయించారట…వెంకటేష్ ని మరోసారి మాస్ యాంగిల్ లో చూపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనేలా చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ చేసిన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా వెంకటేష్ కెరియర్ లోనే ఒక గొప్ప విజయంగా నిలిచిపోయింది… ప్రస్తుతం వెంకటేష్ సైతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుక వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి 300 కోట్లకు పోయిన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండటం విశేషం…వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు. కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అభిమానుల నుంచి కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…