Spiritual Tips: మానవ జీవితంలో ఆధ్యాత్మిక వాతావరణం కూడా చాలా అవసరమే. మంచి జీవితం కావాలని కోరుకున్న వారికి దైవ అనుగ్రహం కోసం దేవుళ్లకు పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అంతేకాకుండా వారానికి ఒకసారి లేదా కొన్నిసార్లు పూజలు చేస్తూ.. ఆలయాలకు వెళ్లడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అయితే ఇంట్లో పూజలు చేయడానికి ఎక్కువగా ఆడవాళ్లే ముందుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు కూడా పూజలు చేయాలని కొందరు ఆధ్యాత్మికవాదులు చెబుతున్నారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్లు పూజలు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదెలాగా అంటే?
ఒక ఇంటికి యజమాని ఎవరు అంటే ఇంట్లో ఉన్న మగవారి గురించే చెబుతుంటారు. ఎందుకంటే కుటుంబ బాధ్యత అతనిపైనే ఉంటుంది. ప్రతి విషయంలో కుటుంబ పెద్ద బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇంట్లో అవసరాలను తీరుస్తాడు. ఇంట్లో వారి బాగోగుల కోసం ఎంతో కష్టపడతాడు. ఇలాంటి సమయంలో మగవాళ్లు పూజల విషయంలో కూడా కాస్త శ్రద్ధ పెడితే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా ఎక్కువగా ఆడవాళ్లు మాత్రమే పూజలు చేస్తారు. అయితే ఆడవాళ్లు పూజలు చేయడం వల్ల కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ప్రయోజనాలు పొందుతారు. కానీ మగవాళ్ళు పూజలు చేయడం వల్ల కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుంది.
అందువల్ల ఇంట్లో కూడా కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు పూజలు చేసేందుకు ప్రయత్నించాలి. మగవాళ్లు పూజలు చేస్తే ఆడవాళ్లు వారికి సహకరించాలి. ఇలా కలిసి పూజలు చేయడం వల్ల ఆ ఇల్లు సంతోషంగా ఉండగలుగుతుంది. కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుంది. అయితే నేటి కాలంలో మగవాళ్లు ఎక్కువగా పూజలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఇంట్లో పూజ చేయకుండా ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం లాంటివి చేసిన ఫలితం ఉంటుంది. ఇంట్లో పూజ చేయడానికి వీలు లేని వారు వారానికి ఒకసారి అయినా దైవ దర్శనం చేసుకుంటే కూడా కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది.
Also Read: ఇంటికి సంబంధించిన వస్తువులు కొనే ఈ రాశి వారికి గుడ్ న్యూస్…
ఇక కొందరు వారానికి ఒకసారి తలస్నానం చేయాలని అంటున్నారు. అయితే పూజ చేసే సమయంలో తలంటు స్నానం చేయాలని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి తలస్నానం అంటే తలపై కేవలం నీరు పోసుకోవడం మాత్రమే. తలంటు స్నానం అంటే ముందుగా నెత్తికి నూనె రాసుకొని ఆ తర్వాత స్నానం చేయడం. తల స్నానానికంటే తలంటు స్థానం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ తలంటు స్నానం పూజ చేసే సమయంలో చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
మరో విషయం ఏంటంటే పూజల విషయంలో ప్రశాంతంగా ఉండాలి. ఒకవైపు గొడవ పెట్టుకుంటూ మరోవైపు పూజ చేస్తే ఎలాంటి లాభం ఉండదు. అంతేకాకుండా ఆడవారు పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని వారిని నిందించకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవారు సంతోషంగా ఉంటే ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది. అందువల్ల వారు పూజ చేస్తే వారు సంతోషంగా ఉండగలుగుతారు. కేవలం ప్రయోజనాల కోసమే మాత్రం కాకుండా ఇల్లు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.