Homeఆధ్యాత్మికంShukra Moudyami: మౌడ్యం ముగిసింది.. ఇక పెళ్లిళ్లకు వేళైంది.. ఇక శుభకార్యాలే..శుభకార్యాలు..

Shukra Moudyami: మౌడ్యం ముగిసింది.. ఇక పెళ్లిళ్లకు వేళైంది.. ఇక శుభకార్యాలే..శుభకార్యాలు..

Shukra Moudyami: శుభకార్యాలు నిర్వహించేటప్పుడు గురు బలం తప్పనిసరిగా ఉండాలి. అలాగే శుక్రుడు సైతం అనుగ్రహంగా ఉంటేనే అనుకున్న ఫలితాలు ఉంటాయని కొందరి భావన. అయితే 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌడ్యమి ఏర్పడింది. దీంతో 83 రోజులపాటు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఫిబ్రవరి 17 అమావాస్యతో శుక్ర మౌడ్యమి గడియలు సమాప్తం అవుతాయి. దీంతో ఫిబ్రవరి 18 నుంచి పాల్గుణ మాసం ప్రారంభం తో మంచి రోజులు రానున్నాయి. పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, ఇతర శుభకార్యాలు నిర్వహించడానికి ఇకనుంచి అనుకూలమైన రోజులు ఉండనున్నాయి. అయితే ఏ ఏ నెలలో ఏ ఏ తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

83 రోజుల తర్వాత మళ్లీ మంచి రోజులు రానున్నాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించాలని అనుకునేవారు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా తేదీల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలో 19, 20,21,24,25, తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు తెలుపుతున్నారు. మార్చి నెలలో 1,3,4,7,8,9,11,12 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ నెలలో 15,20,21,25,26,27,28,29 తేదీలు మంచి రోజులుగా ఉన్నాయి. మే నెలలో 1,3,5,6,7,8,13,14 తేదీలు అనుకూలంగా ఉండనున్నాయి. అలాగే జూన్ జూలైలో కూడా కొన్ని రోజుల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ తేదీలు కేవలం మంచి రోజులు అని తెలపడానికి మాత్రమే. శుభకార్యాలు నిర్వహించుకునేవారు తమ జాతకాల దృష్ట్యా శుభ ముహూర్తాలను నిర్ణయించుకోవాలి. అయితే 2026 సంవత్సరంలో కేవలం 53 రోజులు మాత్రమే మంచి రోజులుగా ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి తర్వాత మాఘమాసంలో పెళ్లిళ్ల జోరు ఉండేది. కానీ ఈసారి మౌడ్యం రావడంతో కొన్ని రోజులపాటు శుభకార్యాలు నిర్వహించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మంచి రోజుల్లో కొన్ని వెళ్ళిపోయినట్లే. అయితే మిగతా రోజుల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

మంచి రోజులు రానున్న నేపథ్యంలో చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. అర్చకుల నుంచి బ్యాండ్ మేళం వరకు అందరికీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుభకార్యాలు నిర్వహించుకునే వారు ముందుగానే వారికి అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా పెళ్లిళ్ల కార్యక్రమాలు నిర్వహించుకునేవారు ఫంక్షన్ హాల్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాదిలో మంచి రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముందుగానే తమ శుభకార్యాలను నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular