Astrology: శని పేరు చెప్పగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఒక్కసారి శని పట్టిందంటే ఏడేళ్ల వరకు విడిచిపెట్టడని కొందరు చెబతారు. కానీ శనిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. మనుషులు చేసే తప్పులకు శిక్షలు వేస్తూ.. వారిని సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఈ క్రమంలో కొందరు తమకు ఎప్పటికీ కష్టాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ తమ తప్పులకు అవి కష్టాలు అని గుర్తించరు. అయితే శని పీడ ఉన్న వారు.. ఆ దేవుడి అనుగ్రహం పొందితే కాస్త ఉపశమనం ఉంటంది. ఇందు కోసం ప్రతి మంగళ, శనివారాల్లో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరడి నంచి ఉపశమనం కలుగుతుందని పండితులు అంటున్నారు. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. ఈ కాలంలో శనీశ్వరుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రాశులపై శని దేవుడి దయ ఎక్కువగా ఉందని తెలస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి శని పీడ ఉన్నా.. మరికన్నొ రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ అదృష్టం పొందే రాశులు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్లండి..
పుష్యమాసం సందర్భంగా తులా రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ కాలంలో వ్యాపారులు అయితే వారు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా.. లాభాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. వీరు ఈ మాసం మొత్తం సంతోషంగా గడపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అయితే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డబ్బు దుబారా అవుతుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇంకా వీరికి మంచి జరగాలంటే నవగ్రహాల పూజ చేయాలి. అప్పుడు కొంత ఆర్థికంగా పటిష్టంగా మారుతారు.
మకర రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం ఉండనుంది. వీరు భూములు కొనుగోలు, అమ్మకాల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. దీంతో లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు దుబారా ఖర్చులు చేస్తూ లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అందువల్ల అవసరమైన వరకే ఖర్చు పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే జీవిత భాగస్వామితో వివాదం ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. బయట జరిగే అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. పూర్వీకుల ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు.
మీన రాశి కలిగిన ఉద్యోగులు పుష్యమాసంలో అదృష్టవంతులు. వీరు ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వీరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సబ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి అవకాశాలు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతి ఆదివారం సూర్య భగవానుడిడని పూజ చేస్తే సరైన ఫలితాలు ఉంటాయి.అలాగే నవగ్రహాల పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.