Greater Bangladesh conspiracy: గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం.. బంగ్లాదేశ్ లోని రాడికల్ ఇస్లామిస్టులు భారత్ లోని ప్రాంతాలను కలిపి దీన్ని విస్తృత పరిచి ఈ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీని నేపథ్యం ఏంటని చూద్దాం.
బెంగాల్ సబ్ నేషనలిజం.. మతవాదం 1905 నుంచి బెంగాల్ ప్రావిన్సులో మొదలైంది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా మారి బ్రిటీష్ కంట్లో నలుసుగా ఉన్న బెంగాల్ ను అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ పట్టుబట్టి మరీ బెంగాల్ ను విభజించాడు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. స్వదేశీ ఉద్యమం మొదలైంది. ఆనాటి బెంగాల్ అంటే ఇప్పటి పశ్చిమ బెంగాల్, ఇప్పటి బంగ్లాదేశ్, బీహార్, ఒడిశా ఈ నాలుగు ప్రాంతాలను కలిపి బెంగాల్ ప్రావిన్స్ అనేవారు.
ఇప్పుడున్న బంగ్లాదేశ్ ను విడదీసి ఈశాన్య ప్రాంతాలను కలిపి ఓ ప్లాన్ చేశారు. చివరకు ఈ బెంగాల్ విభజనకు తలొగ్గి బ్రిటీష్ వారు మళ్లీ కలిపేశారు. 1912లో మళ్లీ బెంగాల్ ను కలిపారు. కలుపుతూ ‘భాష ప్రయుక్తాన్ని’ వేరు చేశారు. బెంగాల్ ప్రావిన్స్ లోని బీహార్, ఒడిశాను వేరు చేసి భాష ప్రయుక్తంగా ప్రావిన్సులుగా చేశారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర లోని ప్రాంతాలతో గ్రేటర్ బంగ్లాదేశ్ కుట్ర.. దీనిపై ‘రామ్’ గారి సునిశితమైన విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.