Rahu, Guru Graham: బృహస్పతి, కేతు గ్రహం కలయిక.. ఈ మూడు రాశుల్లో అనూహ్య మార్పులు

కర్కాటక రాశిపై గురు,కేతుల కలయిక ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి కలిగిన వ్యక్తుల్లో అదృష్టం వరించనుంది. ఓ పని పూర్తి చేసి రిజల్ట్ కోసం వేచి చూసేవారు శుభవార్త అందుకుంటారు.

Written By: Chai Muchhata, Updated On : April 30, 2024 10:53 am

Rahu Guru

Follow us on

Rahu, Guru Graham:గ్రహాలకు అధిపతి బృహస్పతి. ఈ గ్రహానికి కేతు గ్రహం కలవడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. రాహు, కేతులను ఉన్న వారి జీవితం గందరగోళంగా ఉంటుంది. వీరిలో కేతువు అశ్వని, మూలా, ముఖ నక్షత్రాలకు అధిపతిగా ఉంటాడు. అలాంటి కేతువు ఇప్పడు బృహస్పతితో కలవడం వల్ల అనేక మార్పులు చోటు చేసుకోన్నాయి. దీంతో కొన్ని రాశులు కలిగిన జీవితంలో అనుకోని సంఘటనలు జరగుతాయి. అ రాశులేవో చూద్దాం..

బృహస్పతి , కేతువు కలయిక వల్ల వృషభ రాశిపై ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాశి కలిగిన వ్యక్తుల జీవితాల్లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో రాణిస్తారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.

కర్కాటక రాశిపై గురు,కేతుల కలయిక ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి కలిగిన వ్యక్తుల్లో అదృష్టం వరించనుంది. ఓ పని పూర్తి చేసి రిజల్ట్ కోసం వేచి చూసేవారు శుభవార్త అందుకుంటారు. అనుకోని ధన లాభం ఉంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కేతు, గురుల కలయిక కన్య రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి గల వారు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులతో సత్సంబంధాలు నెరుపుతారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఓ పని పూర్తవుతాయి. గతంలో చేసిన అప్పులు తీరుతాయి.