Mswati III: పూర్వకాలంలో రాచరిక పాలన ఉండేది. రాజులు ఎంతో మహిళలను పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎవరో కొందరు మాత్రమే ఈ పాలనను పాటిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం వారికి నచ్చినట్లు ఉంటున్నారు. ఉదాహరణకు ప్రపంచమంతా ఒక రూల్ ఉంటే.. ఉత్తర కొరియాలో మాత్రం వేరే రూల్స్ ఉంటాయి. ఇక్కడి జరిగే అరాచకాలు చెప్పలేనివి. ప్రజలకు మంచి చేసేవి కంటే ఇబ్బంది పెట్టే రూల్స్ ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే చెప్పక్కర్లేదు. జీన్స్ వేసుకోకూడదు, అలా ఉండాలని చెప్పలేనన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడి రూల్స్ పాటించకపోతే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. అయితే ఆఫ్రికన్ ప్రాంతమైన స్వాజిలాండ్‌లో కూడా రూల్స్ ఇంతకు మించి ఉన్నాయి. ఇంతకీ అవేంటో మరి చూద్దాం.
ప్రతీ ఏడాది ఒక్కో అమ్మాయిని ఈ స్వాజిలాండ్ రాజు Mswati III వివాహం చేసుకుంటాడు. ఇతనికి కుటుంబం చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే భార్యలు, పిల్లలు, వారి పిల్లలు చూస్తే ఇంత పెద్ద కుటుంబం అనాల్సిందే. దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్ సమీపంలో ఈ ప్రాంతం ఉన్న ప్రాంతాన్ని స్వాజిలాండ్ అని గతంలో పిలిచేవారు. ప్రస్తుతం ఎస్వాటిని అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతీ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ సమయంలో పదివేల మంది కన్యలు, యువతలు నగ్నంగా నృత్యం చేస్తారు. ఇలా నృత్యం చేసిన వారిలో ఒక కొత్త అమ్మాయిని ఎంచుకుని తనని వివాహం చేసుకుంటాడు. ఇలా ప్రతీ ఏడాది రాజు పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి ఇప్పటి వరకు 16 మంది భార్యలు ఉన్నారు. అలాగే పిల్లలు కూడా 45 మంది ఉన్నారు. అయితే ఈ ఆచారంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజు ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ 15 మంది భార్యలు, పిల్లలతో కలిసి వెళ్తుంటారు. ప్రజలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న కూడా రాజు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కడికి వెళ్లిన అందరికి ఖర్చు పెట్టడానికి చాలా డబ్బు అవుతుంది. అందులోనూ బాగా విలాసవంతంగా గడపడం వల్ల విమర్శలు వస్తున్నాయి. ఈ డ్యాన్స్‌ను కూడా దేశంలో ఉండే యువత వ్యతిరేకించింది. ఇలా నగ్నంగా డ్యాన్స్ వేయడం ఏంటని ప్రశ్నించింది. నగ్నంగా డ్యాన్స్ వేసిన తర్వాత రాజు వివాహం చేసుకోవడం ఏంటని తెలిపింది. ఇలా అడిగిన వారందరికి కఠినంగా శిక్షించారు. అలాగే జరిమానా కూడా విధించారు. 2015లో ఇండియాలో ఆఫ్రికా సమ్మిట్ జరిగింది. దీనికి వచ్చిన ఆ రాజు కుటుంబం ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో దాదాపుగా 200 గదులు బుక్ చేశారు. అంటే వారి కుటుంబం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.