Visit in India during Navratri: నవరాత్రుల్లో ఇండియాలో సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే!

దేశవ్యాప్తంగా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ రోజు ఐదో రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దేవీ నవరాత్రులను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఎన్నో నియమాలు పాటిస్తూ.. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు

Written By: Kusuma Aggunna, Updated On : October 7, 2024 2:43 pm

Devi-navaratri

Follow us on

Visit in India during Navratri: దేశవ్యాప్తంగా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ రోజు ఐదో రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దేవీ నవరాత్రులను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఎన్నో నియమాలు పాటిస్తూ.. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ప్రదేశాలను బట్టి పూజ పద్ధతులు కూడా మారిపోతాయి. దేవీ నవరాత్రులను దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. లైఫ్‌లో ఒక్కసారైన ఆ ప్రదేశాలను సందర్శించాల్సిందే. మరి దేవీ నవరాత్రుల సందర్భంగా దేశంలో ఏయే ప్రదేశాలను సందర్శించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు కనకదుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తుంది. నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆలయం భక్తులతో నిండిపోతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేచి ఉంటారు.

కోల్‌కతా
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. దుర్గా పూజ పేరుతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ఈ సమయంలో కోల్‌కతా నగరం దుర్గాదేవి విగ్రహాలతో నిండిపోతుంది. ఎక్కడ చూసిన పెద్ద పెద్ద మండపాలతో అమ్మవారిని భక్తితో పూజిస్తారు. కోలకతాలో మండపాలను పెండాళ్లు అంటారు. అయితే ఇక్కడ చాలా ప్రత్యేకంగా మండపాలను నిర్మిస్తారు. బొనెది బరీ అనే పేరుతో రాజభవనాల్లో దుర్గాదేవీ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లైఫ్‌లో ఒక్కసారైన దసరా పండుగ సమయంలో కోలకతా వెళ్లి తీరాల్సిందే.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌
సాధారణంగా ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఛ‌త్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు మాత్రం ఈ పండుగ‌ను 75 రోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడ ఉండే బ‌స్త‌ర్ గిరిజ‌నులు ఈ ద‌స‌రా పండుగ‌ను ప్ర‌కృతి ఆరాధ‌న‌గా భావించి పూజిస్తారు. బస్తర్ గిరిజనుల దేవత దంతేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

గుజరాత్
న‌వ‌రాత్రుల వేడుకలను గుజ‌రాత్‌‌లో అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక్క‌డ ఉండే హాలెరి రాజులు దసరా పండుగను ప్రత్యేకంగా చేస్తారని చెబుతుంటారు. గుజరాత్‌తో దసరా పండుగను మరియమ్మ అని పిలుస్తారు. ఈ రాష్ట్రం స్పెషల్ నృత్యం గర్భా.. చూస్తే రెండు కళ్లు చాలవు. ఇక్కడ ప్రజలు అమ్మవారికి గుజరాతీ హారతీ నృత్యం చేస్తారు. రంగు రంగుల దుస్తులు ధరించి నృత్యం చేస్తారు.

రాజస్థాన్
రాజస్థాన్‌లోని కోటాలో దసరా వేడుకలు చాలా ఘనంగా చేస్తారు. ప్రతీ ఏడాది 25 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటారు. ముఖ్యంగా మేళా అనే జాతరను కూడా నిర్వహిస్తారు. పండుగ సమయంలో రావణుడి విగ్రహాలను కూడా కాల్చుతారు. చంబల్ నది ఒడ్డున జరిగే ఈ పండుగను చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.