Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 3న శుక్రవారం ద్వాదశ రాశులపై పునర్వుసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి అనుకూల ప్రయోజనాలు ఉండగా.. మరికొందరికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. . నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
పూర్వీకుల నుంచి ఆస్తి లభించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. ఆకస్మిక అతిథులు ఇంటికి రావొచ్చు.
వృషభం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని సమస్యలపై ఆందోళన చెందుతారు. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించాలి.
మిథునం:
ఒప్పందాలు చేసుకుటారు. వాటికి అనుకూల సమయమే. ప్రణాళికలు వేసి ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామితో కొనసాగిన ఇబ్బందులు తొలగిపోతాయి.
కర్కాటకం:
వ్యాపారులకు అనుకూల సమయమే. అయినా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.కుటుంబ వ్యాపారుల్లో సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. సోదరులతో ఉన్న విభేదాలు తొలిగిపోతాయి.
సింహం:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉ:టారు. ఉదయం నుంచి ఇంటి పనుల్లో బిజీగా ఉ:టారు. కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో ప్లాన్ వేస్తారు.
కన్య:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలం. ఏ పని చేసినా విజయం అందుతుంది. ముఖ్యమైన విషయాలపై చర్చలు పెడుతారు. ఓ ప్రముఖ వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది.
తుల:
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పిల్లల కోసం సుదూరం ప్రయాణించే అవకాశం. వ్యాపారులు పెట్టుబుడుల పెట్టడం వల్ల భారీ లాభాలు పొందే అవకాశం.
వృశ్చికం:
ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మానసిక ఇబ్బందులు ఉంటే రిలాక్స్ గా ఉండడానికి ప్రయత్నించాలి. కష్టపడి చేసే ప్రయత్నంలో విజయం మీ సొంతం అవుతుంది.
ధనస్సు:
కుటుంబంలో కొన్ని చిక్కులు రావడం వల్ల ఇబ్బందులు పడుతారు. సంతృప్తికరమైన వార్తలు వింటారు. ఇతరులకు సేవ చేసేందుకు ముందుకు వస్తారు.
మకరం:
వ్యాపారులు ప్రణాళిక తో ముందుకు వెళ్లాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.అయితే ఇతరుల మద్దతు ఉంటుంది.
కుంభం:
సేవ చేసే వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదం వాయిదా వేసుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చు. భవిష్యత్ లో మంచి లాభాలు ఉంటాయి.
మీనం:
బంధువుల నుంచి రుణాలు అందుతాయి. వివాదాల జోలికి పోవద్దు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. పిల్లల విషయంలో కేర్ తీసుకుంటారు.