Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 26న గురువారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ధ్రువ ప్రయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఈ క్రమంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
రుణాలు తీసుకునేందుకు మంచి సమయం. అధికారుల సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.
వృషభం:
ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయినా ఇతరులకు సాయం చేసేందుకు సిద్ధమవుతారు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అయినా మనోబలంతో సమస్యలన్నీ పరిష్కరించగలుగుతారు.
కర్కాటకం:
కార్యాలయాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే పెద్ద సమస్య వచ్చిపడుతుంది. ఆశించిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం.
సింహం:
ఈరోజు చేసే పనిలో ప్రయోనాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు కార్యాయాల్లో అనుకూల వాతావరణం. స్నేహితులను, బంధువులను కలుస్తూ ఉల్లాసంగా గడుపుతారు.
కన్య:
కుటుంబంలో కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రుణాలు తీసుకుంటారు. అయితే సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ప్రయత్నించండి. కాలక్రమేనా పరిస్థితులు చక్కబడుతాయి.
తుల:
కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. ఇతరులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు . శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం.
వృశ్చికం:
ఈ రాశివారికి అనూహ్యంగా అదృష్టం పడుతుంది. ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు:
ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఏ విషయాల్లోనైనా ఆచితూచి వ్యవహరించాలి. పర్యటనలు వాయిదే వేయడమే మంచిది. కష్టపడి పనిచేయగలుగుతారు.
మకరం:
వాతావరణం సానుకూలంగా ఉంటుంది. రోజువారి ఖర్చులకు డబ్బు ఖర్చు అవుతుంది. ఒక పని సక్సెస్ కావడంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
కుంభం:
సీనియర్ల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉదయం నుంచే నిరాశజనకంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడొద్దు. ఖర్చులు తక్కువగానే ఉంటాయి.
మీనం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు పెరిగే అవకాశం. ఇతరులతో పోలిస్తే మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది.