Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 10న ఆదివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశి వారు ఇతరుల పనులపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కానీ ఇది నష్టాన్ని చూపుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెడుతారు. ఇతరులతో సంయమనం పాటించాలి.
వృషభం:
ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కొన్ని పనులు మీ నియంత్రణలోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారికి అనుకూలం.
మిథునం:
విహారయాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇతరులకు ఇచ్చే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం అనవసర ఖర్చులు పెడుతారు. కొంత ఆందోళన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:
రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ల వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
సింహం:
కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. అపూర్వమైన విజయాలు మీ సొంతమవుతాయి. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి.
కన్య:
భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరుడి వివాహానికి ప్రయత్నాలు చేస్తారు.ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఇతరులతో వాదనలకు దిగొద్దు.
తుల:
అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. పోటీ పరీక్షకల్లోని వారు విజయం సాధిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చికం:
ఇతరుతలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాల జోలికి పోకూడదు. స్నేహితులను కలుస్తారు. ఎవరైనా మీ వ్యాఖ్యలను చెడుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
ధనస్సు:
ఆర్థిక నష్టాలను చూస్తారు. కోర్టు వివాదాలు చుట్టుముడుతాయి. సహోద్యోగులతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేస్తారు.
మకర:
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు ఇంట్లో వాళ్ల సలహా తీసుకోవడం మంచిది. ఎవరి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కుంభం:
ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్వికుల ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడుతాయి.
మీనం:
పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువుల సాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఇంట్లో వాళ్లను సంప్రదించాలి.