Pancharama Temples: ఈ క్షేత్రాలను కార్తీక మాసంలో దర్శిస్తే.. కోరిన కోరికలు నెరవేరడం పక్కా!

ఏపీ ప్రజలు కార్తీక మాసంలో తప్పకుండా పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. ఈ క్షేత్రాలను దర్శించడం వల్ల అనుకున్న పనులన్నీ జరగడంతో పాటు శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పట్టణాల్లో ఉన్న ఈ పంచారామ క్షేత్రాలు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 20, 2024 5:45 pm

Pancharama Temples

Follow us on

Pancharama Temples: హిందూ పండుగల్లో కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత వేరే. ఈ నెలలో చాలామంది శివుడిని భక్తితో పూజిస్తారు. ఏడాది మొత్తం మీద చూసుకుంటే ఈ కార్తీక నెలలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ శివుడిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అయితే ఈ నెలలో చాలామంది శివుని ఆలయాలు సందర్శిస్తారు. శివుని ఆలయాలు సందర్శించి దేవుడిని దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఎన్ని పనులు ఉన్న కూడా తప్పకుండా ఈ నెలలో కొన్ని శివుని ఆలయాలను దర్శిస్తారు. అయితే ఏపీ ప్రజలు కార్తీక మాసంలో తప్పకుండా పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. ఈ క్షేత్రాలను దర్శించడం వల్ల అనుకున్న పనులన్నీ జరగడంతో పాటు శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పట్టణాల్లో ఉన్న ఈ పంచారామ క్షేత్రాలు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

ద్రాక్షారామం
ఐదు పంచారామాల్లో ద్రాక్షారామం ఒకటి. శివుడిని ఇక్కడ భీమేశ్వరుడిగా కొలుస్తారు. అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాల్సిందే. ముఖ్యంగా కార్తీక మాసంలో అసలు ఆంధ్రా ప్రజలు మిస్ కారు. మధ్య చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం శివుని పర్వదినాల్లో భక్తులతో కిటకిట లాడుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. కార్తీక మాసంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల్లో ఇది ఒకటి.

అమరారామం
అమరేశ్వరుడిగా పూజలందుకునే అమరారామం పంచారామాల్లో రెండోవది. స్పటిక శివలింగంలో ఉండే శివునికి పూజలు నిర్వహిస్తారు. గుంటూరు జిల్లాకి 35 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఈ ఆలయం ఉంది.

క్షీరారామం
ఈ ఆలయాన్ని చాళుక్యులు 11వ శతాబ్ధంలో నిర్మించారని చెప్పుకుంటారు. రెండున్నర అడుగుల ఎత్తులో తెల్లగా ఉండే శివలింగాన్ని ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ లింగాన్ని త్రేతా యుగంలో సీతారాములు ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈ క్షీరారామం ఉంది. అయితే ఈ ఆలయానికి ఒక కథ ఉంది. భూమిపై శివుడు బాణాన్ని వదిలినప్పుడు ఇక్కడ పడితే క్షీరదార వచ్చిందని చెప్పుకుంటారు.

సోమారామం
ఇక్కడ చంద్రుడు శివలింగాన్ని ప్రతిష్టించాడని సోమారామంగా పిలుస్తారు. అయితే ఈ ఆలయంలో ఉండే శివలింగం సాధారణ రోజుల్లో తెలుగు, నలుపు రంగులో ఉంటుంది. కానీ అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో కనిపిస్తుంది. మళ్లీ పౌర్ణమి సమయానికి సాధారణంగా మారుతుంది. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సమీపంలో ఉన్న గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది.

కుమార భీమారామం
ద్రాక్షారామం ఈ కుమార భీమారామం రెండు ఆలయాలు కాస్త ఒకేలా ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈ ఆలయం ఉంది. కార్తీక మాసంలో తప్పకుండా ఈ పంచారామాలను దర్శించుకుంటారు. శివునికి ప్రతీకగా ఉన్న ఈ పురాతన ఆలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.