Bigg Boss Telugu 8:బిగ్ బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ కి ఉండే క్రేజ్ వేరు. వారం మొత్తం హౌస్ లో జరిగిన సంఘటనల గురించి హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో మాట్లాడే మాటల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఇంకా ఆతృతగా ఎదురు చూసారు. కారణం హౌస్ లో ఈ వారం మొత్తం జరిగిన సీరియస్ సంఘటనలు అలాంటివి మరి. ప్రతీ శనివారం హౌస్ మేట్స్ చేసే తప్పులను ఎత్తిచూపుతూ క్లాస్ పీకే నాగార్జున, ఈ శనివారం మాత్రం ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడం మానేసి, పృథ్వీ రాజ్ బొచ్చు, గెడ్డం మీద 15 నిమిషాలు చర్చ పెట్టాడు. ఇంతటి చెత్త వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడూ చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శనివారం ఉండాల్సిన ఫైర్ మాత్రం లేదు, కానీ ఆదివారం ఎపిసోడ్ లో ఉండాల్సిన ఫన్ ఉందా అంటే, ఉందనే చెప్పాలి. కాసేపటి క్రితమే విడుదల చేసిన ప్రోమోస్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో చేసిన కామెడీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ సోషల్ మీడియా లో కంటెస్టెంట్స్ పై వైరల్ అయిన కొన్ని ఫన్నీ మీమ్స్ ని చూపిస్తాడు. ఈ వారం నామినేషన్స్ లో పృథ్వీ రాజ్, అవినాష్ మధ్య జరిగిన ఫైట్ ఏ రేంజ్ లో ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఫైట్ పై సోషల్ మీడియా లో ఎన్నో మీమ్స్ వచ్చాయి. అందులో ‘బాద్ షా’ చిత్రంలో బ్రహ్మానందం నాజర్ పై కోపం తెచ్చుకునే సన్నివేశాన్ని అవినాష్,పృథ్వీ, ప్రేరణ మరియు ఇతర కంటెస్టెంట్స్ కి ఉపయోగించి చేసిన ఫన్నీ మీమ్ ని వేశారు. బ్రహ్మానందం క్యారక్టర్ లో పృథ్వీ, నాజర్ క్యారక్టర్ లో అవినాష్, మరియు బ్రహ్మానందం భార్య క్యారక్టర్ లో ప్రేరణ ఉంటారు. అవినాష్, పృథ్వీ గొడవ పడుతున్న సమయంలో మధ్యలో ప్రేరణ పృథ్వీ తో మాట్లాడుతూ ‘నేను నిన్ను నామినేషన్ లో వేయాలని అనుకుంటున్నాను’ అని అంటుంది.
అప్పుడు పృథ్వీ కోపం చెంప దెబ్బ కొడుతాడు. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ ని కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ మీమ్ ని చూసి హౌస్ మేట్స్ అందరూ పగలబడి నవ్వుకున్నారు. అలా ఈ ప్రోమో లో గంగవ్వ, విష్ణు ప్రియా సంభాషణ మీద ఒక మీమ్, మణికంఠ మీద ఒక మీమ్ వేశారు. ఇక చివర్లో గౌతమ్, మణికంఠ మధ్య జరిగే ఎలిమినేషన్ రౌండ్ కి సంబంధించిన షాట్ ని వేశారు. వీళ్ళిద్దరిలో మణికంఠ ఎలిమినేట్ అయ్యాడనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఓటింగ్ పరంగా మాత్రం గౌతమ్ అందరికంటే తక్కువలో ఉన్నాడు, కానీ మణికంఠ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది.
Nagarjuna turns the #BiggBoss house into a laughter zone by showing contestants the funniest memes made by fans! Who laughed the hardest at their meme moment? #BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/3OBJnW5gRk
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 20, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Prithvi slapped prerna before nagarjuna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com