Padmanabha Swamy Temple: కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చలు సాగుతూ ఉంటాయి. 2011లో ఈ ఆలయంలో గురించి కొన్ని ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. శ్రీ మహా విష్ణువు కొలువైన ఈ ఆలయంలో రహస్య గదులు ఉన్నాయని, ఇందులో లక్షల కోట్ల విలువైన సంపద ఉందని బయటపడింది. అయితే ఇందులో కొన్ని గదులు తెరవడానికి నాగబంధం వేశారన్న ప్రచారం సాగింది ముఖ్యంగా ఇందులో ఉన్న రహస్య గదుల్లో ఆరో గదిని తెరవడానికి ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. అయితే ఆ ఆరో గదిని తెరవకపోవడానికి కారణం ఏంటో తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా కేరళ లోని తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ ప్రసిద్ధికెక్కింది. 2011 వరకు ఈ ఆలయానికి అతికొద్ది మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. కానీ 2011 తరువాత ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. 1908లో ఈ గుడి ట్రావెన్ కోర్ ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఇందులోని రహస్య గదులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఒక నాగుపాముల గుంపు కనిపించిందట. దీంతో రహస్య గది వైపునకు వెళ్లలేదు.
అయితే 2011లో రిటైర్డ్ ఆఫీసర్ సుందర రాజన్ అధికారులతో కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆలయంలో స్వామి వారి ఆభరణాలను మాయం చేసి వాటి స్థానంలో గిల్టీ నగలు ఉంచారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంపదను లెక్కించడానికి సుప్రీం కోర్టు ఒక టీంను ఏర్పాటు చేసింది. దీంతో ఈ బృందం ఆలయంలోకి వెళ్లగా.. అక్కడ వీరికి ఆరు గదులు కనిపించాయి. 2011 జూన్ 27న ఇందులోని ఒక గదిని ఓపెన్ చేశారు. ఇందులో అత్యంత విలువైన ఆభరణాలు కనిపించాయి.
అయితే వీటిలో ఉన్న ఆరో గదిని మాత్రం తెరవ లేకపోయారు. ఈ గది గురించి ఉత్తరం తిరుణాల మార్తాండం అనే వ్యక్తికి మాత్రమే తెలుసు. అయితే ఆయన 2013లో మరణించాడు. దీంతో ఆ గదిలో ఏముందో తెలియకుండా పోయింది. అయితే ఓ వ్యక్తి ఆ గదిని తెరవడానికి ప్రయత్నించాడు. కానీ ఆదే సంవత్సర కేరళలో విపరీతమైన వరదలు వచ్చాయి. అంతేకాకుండా ఈ గది తలుపు దగ్గరికి వెళ్లి చెవిని ఉంచితే పాములు బుస కొట్టే శబ్దం వినిపిస్తుంది. మరికొంత మందికి సముద్రపుశబ్దం వినిపిస్తుందట. దీంతో ఈ గదిని తెరవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.