https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో కొత్త హీరోయిన్… ఆమె అందం చూస్తే ఫిదా అవుతారు…

పుష్ప 2 తర్వాత ఆయన చాలా క్రేజీ కాంబినేషన్లను సెట్ చేశాడు.ఇక ఇదే టైం లో ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్ సైతం ఆయన సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 20, 2024 / 01:56 PM IST

    Sneha Reddy as heroine in Allu Arjun next Film

    Follow us on

    Allu Arjun: తెలుగుసినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయనతో నటించడానికి స్టార్ హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇక పుష్ప 2 తర్వాత ఆయన చాలా క్రేజీ కాంబినేషన్లను సెట్ చేశాడు.ఇక ఇదే టైం లో ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్ సైతం ఆయన సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు.

    మరి ఇలాంటి క్రమం లో ఆయన చాలామంది హీరోయిన్స్ తో సినిమా లు చేయాలని చూస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక కొత్త హీరోయిన్ ను కూడా తన సినిమాలో తీసుకోబోతున్నాడంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు. ఇక అందంతోపాటు చాలా గ్లామర్ గా కనిపించే ఆ కొత్త అమ్మాయి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఇక ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అంటే అల్లు అర్జున్ భార్య అయిన ‘స్నేహలత రెడ్డి’.అవును మీరు వింటుంది నిజమే..

    స్నేహలత రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్టైలిష్ ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం ఆమె గోల్డ్ కలర్ సారీ లో పెట్టిన పిక్స్ అయితే అందరిని విపరీతం గా ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే దివిలో ఉన్న అందాలతార భువి పైకి దిగి వచ్చింది అంటూ మరికొంతమంది ఆమెను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.

    ఇక తన భార్య అయిన స్నేహాలత రెడ్డిని తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలి అంటూ అల్లు అర్జున్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తను ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కూడా ఇప్పటికీ అందాన్ని మెయింటేన్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆమె తీసుకునే డైట్, దానితో పాటుగా ఆమె డైలీ చేసే యోగనే దానికి కారణమని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఆమెను అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడా లేదా చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..