OYO room safety tips: వయసుతో తారతమ్యం లేకుండా ఇటీవల కాలంలో ఓయో రూమ్స్ కు వెళ్తున్నవారు ఎక్కువ అవుతున్నారు… ఓయో గదులను చాలామంది దేనికి ఉపయోగించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది యువత మాత్రం చదువుకోవడం లేదా ముఖ్యమైన పనులు, ఇతర సమావేశాల కోసం వినియోగించుకుంటారు. కొంతమంది అయితే లైవ్ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి ఓయో రూములను ఉపయోగించుకుంటారు.
ఓయో రూముల గురించి రకరకాల ప్రచారాలు ఉన్నప్పటికీ.. వాటిని కొంతమంది మంచి పనులకు కూడా ఉపయోగించుకుంటారు. అది తెలంగాణ రాష్ట్రంలో రాయదుర్గంలోని ఓయో రూమ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం సృష్టించింది. రాయదుర్గం ప్రాంతంలోని ఓయో హోటల్లో అనుష అనే బ్యూటీ పార్లర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. అనూష వయసు 26 సంవత్సరాలు. ఈమె గతంలోనే వివాహం జరిగింది. విడాకులు కూడా తీసుకుంది. ఈనెల 23న కన్ను మూసింది.. గచ్చిబౌలిలోని క్యూబిన్ ఓయో లోని లాడ్జిలో అనూష కన్ను మూసింది. అనూష నల్గొండలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Sleeping for Good Health : ఆరోగ్యంగా ఉండటానికి 8 గంటల నిద్ర నిజంగా అవసరమా? అధ్యయనాలు ఏం అంటున్నాయి?
అనూష మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించలేకపోతున్నారు. వాస్తవానికి ఈ తరహా గదిలలో మరణాలు చోటుచేసుకున్నప్పుడు వాటిని పోలీసులు ఆత్మహత్యలుగానే పేర్కొంటారు.. మృతుల బంధువులు ఒకవేళ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కేసును అనుమానాస్పద మృతిగా కేసుగా పేర్కొంటారు. ఇక అనూష కేసులను ఇదే జరిగింది. ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కేసు విచారణ మొదలుపెట్టారు.. అయితే అనూష సంతోష్ అనే యువకుడితో ఓయో లాడ్జికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే హోటల్ గదిని ఆమె పేరు మీద కాకుండా.. వేరే వారి పేరు మీద బుక్ చేసినట్టు సమాచారం. సాధారణంగా ఓయో కు వెళ్లేవారు తమ పేరు మీద రూమ్ బుక్ చేసుకుంటారు. ఓయో యాజమాన్యం కూడా ఆధార్ కార్డును అన్ని విధాలుగా పరిశీలిస్తుంది. ఆ తర్వాతనే రూమ్ కేటాయిస్తున్నట్టు సందేశం పంపుతుంది. మరి అనుష వేరొక పేరు మీద రూమ్ ఎలా బుక్ చేసింది? దానిని ఓయో యాజమాన్యం ఎలా కేటాయించింది? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Inspirational Women : 58 ఏళ్ళ వయసులో ఇంటర్ పాస్ అయింది..ఈ మహిళ తెగువకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!
ఓయో లో పనిచేసే సిబ్బంది రూమ్ క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు అనూష అందులో ఫ్యాన్ కు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.. పోలీసులు వచ్చి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అనూష అలా చనిపోవడం వెనక కారణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో సంతోష్ ఎవరనేది పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఒక రకంగా ఆధార్ కార్డు పరిశీలిస్తే అతడు ఎవరో తెలుస్తుంది. ఒకవేళ సంతోష్ అనే వ్యక్తి అనూషను చంపివేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరుడు చెబుతున్నాడు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. హోటల్ సిబ్బంది స్టేట్మెంట్ ఇప్పటికే తీసుకున్నారు. అనూష ఫోన్ రికార్డులను, కాల్ డాటాను ఇప్పటికే పోలీసులు తెప్పించుకున్నారు. అనూష ఘటన చాలా విలువైన పాఠాలు చెబుతోంది. ముఖ్యంగా ఓయోకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఇతర వ్యక్తుల ఆధార్ కార్డుల ద్వారా ఓయో రూమ్ లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.