Vinayaka Chavithi : ఈ ఏడాది వినాయక చవితి ఏ తేదీన జరుపుకోవాలి?

వినాయక చవితి పండుగను భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకోవాలి. ఆ తిథిలో మాత్రమే విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఈ రోజును గణేశుడిని ఇంటికి తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోవాలి.

Written By: Kusuma Aggunna, Updated On : August 30, 2024 10:39 am

Vinayaka Chavithi 2024

Follow us on

Vinayaka Chavithi :  హిందూ ప్రజలు ఎంతగానో ఎదురు  చూసే వినాయక చవితి పండుగ రానే వస్తుంది. ఈ పండుగ గురించి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభం అయిన రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు పిల్లలకు పండగ అని చెప్పుకోవాల్సిందే. హిందూ పండుగల్లో వినాయక చవితి చాలా ముఖ్యమైనది. ఈ పండుగ వచ్చిందంటే ఇక అన్ని పండుగలు వస్తాయి. వినాయకుడిని పూజించడం వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని సక్రమంగా జరుగుతాయని నమ్ముతారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా కొన్ని రోజుల పాటు జరుపుకుంటారు. వినాయకున్ని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అయితే ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? ఏ సమయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలి? పూజ చేయడానికి శుభ సమయం ఏంటో పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

వినాయక చవితి పండుగను భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకోవాలి. ఆ తిథిలో మాత్రమే విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఈ రోజును గణేశుడిని ఇంటికి తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోవాలి. చతుర్థి తిథిలో మాత్రమే పండుగ చేసుకోవాలి. ఈ తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 12:08 గంటలకు మొదలవుతుంది. తర్వాత రోజు అనగా సెప్టెంబర్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:05 గంటలకు పూర్తవుతుంది. కాబట్టి చతుర్థి తిథి ఉన్న రోజు సెప్టెంబర్ 7 తేదీన ఈ పండుగను జరుపుకోవాలి. అలాగే చవితి తిథి ఉన్న సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 6వ తేదీ 12:08 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం లోగా ప్రతిష్టించుకోవాలి. దాదాపు 10 రోజులు వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తారు. కొంతమంది 21 రోజులు వరకు పూజించి దేవుడిని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. గణేశుడి అనుగ్రహం కలిగి కోరికలు నేరవేరుతాయి. అలాగే ఎలాంటి బాధలు ఉన్న తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ ఆచరించాలి. మంత్రాలు జపిస్తూ ప్రాణ ప్రతిష్ట చేయాలి. గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ప్రతిష్టించడం చాలా మంచిది. అందులోనూ వినాయకుని తొండం కుడివైపుకు ఉండాలి. అలాగే ఎలుక కూడా ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ.. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూ వంటివి చేసి నైవేద్యంగా సమర్పించాలి. పది రోజుల పాటు వినాయకుడిని అసలు కదపకూడదు. చివరి రోజు కదిపి.. వినాయకునికి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి ఆశీస్సులు మీకు అంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు.