Homeఆంధ్రప్రదేశ్‌Jogi Rajiv : ఓ యువతీతో జోగి రాజీవ్ సన్నిహితం.. ఫొటోలు వైరల్.. ఎవరామె?

Jogi Rajiv : ఓ యువతీతో జోగి రాజీవ్ సన్నిహితం.. ఫొటోలు వైరల్.. ఎవరామె?

Jogi Rajiv : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్టయ్యారు జోగి రాజీవ్. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు. అమెరికాలో చదువుకున్న రాజీవ్ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి రావాలని భావించారు. అనూహ్యంగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూములు దోచుకున్నారు అన్నది ఆయనపై ఆరోపణ. అయితే ఈ విషయంలో రాజీవ్ కు ఎటువంటి సంబంధం లేదని.. చిన్న కుర్రాడిని కేసుల్లో ఇరికిస్తారా అంటూ జోగి రమేష్ తో పాటు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.అయితే జోగి రమేష్ కుమారుడికి ఇదివరకే రాజకీయాలతో సంబంధాలు ఉన్న విషయాన్ని కూటమి పార్టీలు బయటపెడుతున్నాయి.గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ ను మట్టి కరిపించాలని.. చంద్రబాబు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని గతంలో రాజు వ్యాఖ్యానించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ.అవి విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇటీవల బయటకు వచ్చారు రాజీవ్. ఇటువంటి తరుణంలో మరో వార్త ఒకటి హైలెట్ అవుతోంది. సోషల్ మీడియాలో వీడియోలతో పాటు ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ యువతితో జోగి రాజీవ్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటపడ్డాయి.అదే సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ యువతితో కూర్చున్న ఫోటోలు సైతం బయటపడ్డాయి.అయితే ఫోటోలను నిశితంగా గమనిస్తే మాత్రం.. నిశ్చితార్థం మాదిరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే హైలెట్ అవుతున్నాయి.

* వైసిపి హయాంలో దూకుడు
జోగి రమేష్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. వైసీపీలో దూకుడు కలిగిన నేత. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా చంద్రబాబు నివాసం పైనే దండెత్తారు. తరచూ చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత కామెంట్స్ చేసేవారు. జగన్ పై వీర విధేయత ప్రదర్శిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. అందుకే కూటమి ప్రభుత్వం జోగి రమేష్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. అందుకే అరెస్టయ్యారు.

* వేర్వేరు ప్రకటనలతో
తన కుమారుడికి ఏమీ తెలియదని.. అసలు రాజకీయాలతో సంబంధమే లేదని జోగి రమేష్ తో పాటు ఆయన భార్య చెప్పుకొచ్చారు. ఆ భూముల వ్యవహారం ఏమిటో తమకు తెలియదని చెప్పారు. అయితే అందరి మాదిరిగానే తాము అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశామని.. అందులో తప్పేమిటని రాజీవ్ ప్రశ్నిస్తున్నారు. అయితే రాజీవ్ కు రాజకీయాలతో సంబంధం లేదని జోగి రమేష్ కుటుంబం చెప్పే ప్రయత్నం చేయగా.. గతంలో రాజీవ్ చేసిన కామెంట్స్ ను టిడిపి హైలెట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే నడిచింది. అయితే ఆ వ్యవహారం సద్దుమణగగా.. ఇప్పుడు కొత్తగా ఎవరితో రాజీవ్ కు నిశ్చితార్థం జరిగిందని ప్రచారం ప్రారంభమైంది.

* ఆ యువతి శ్రేష్ట కర్మోజి?
అయితే తాజాగా వస్తున్న ప్రచారం బట్టి రాజీవ్ తో ఉన్న యువతి పేరు శ్రేష్ట కర్మోజిగా తేలింది. ఆమె ప్రముఖ క్రిస్టియన్ మత ప్రబోధకుడు శామ్యూల్ కర్మోజి కుమార్తెగా తేలింది. విశాఖలో ప్రముఖ చర్చి వ్యవస్థాపకుడు కూడా ఆయన. జోగి రమేష్ కు సామ్యూల్ కర్మోజికి చాలా రోజులుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇరు కుటుంబాలు రాజీవ్, శ్రేష్ట కర్మోజిలకు పెళ్లి చేయడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతోంది. నిరాడంబరంగా నిశ్చితార్థ వేడుకలు పూర్తి చేశారని..అందుకే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయని తెలుస్తోంది. రాజీవ్ కష్టాల్లో ఉంటే.. శ్రేష్ట కర్మోజి ధైర్యం చెప్పేందుకు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

జోగి రమేష్, కర్మోజీ కుటుంబాల మధ్య ఏం జరిగింది.? #engagement #news #jogi #sreshtakarmoji@PEOPLE PULSE

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version