Nara Lokesh : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) యువరాజుగా నారా లోకేష్ పట్టాభిషిక్తులు కానున్నారు. ఈరోజు మహానాడు వేదికగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంత్రులు, సీనియర్ నేతలు లోకేష్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ప్రకటన లాంఛనమేనని చెబుతున్న వారు ఉన్నారు. వాస్తవానికి పార్టీలో కీలక హోదా రాకపోయినప్పటికీ.. ఇప్పటివరకు పార్టీలో నెంబర్ వన్ లోకేష్. పార్టీలో అన్ని రకాల నిర్ణయాలు, నియామకాలు చేపడుతోంది లోకేష్. పేరుకు చంద్రబాబు అధ్యక్షుడు అయినా.. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నది ఆయనే. అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పదవి ఉండాలన్నది నాయకులు, కార్యకర్తల అభిలాష. చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నంతకాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో ఎవరికీ సందేహాలు లేవు. అందుకే మధ్యే మార్గంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి.
* సుదీర్ఘకాలం పార్టీ కోసం..
గత 14 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు నారా లోకేష్( Nara Lokesh). 2009 ఎన్నికల్లో తెరవెనుక సేవలందించారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న లోకేష్ చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఆలస్యం అయ్యింది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగానే సేవలందించారు. రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసుకోవడంలో లోకేష్ విజయవంతం అయ్యారు. పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఎన్నికల ద్వారా చట్టసభకు ఎన్నిక కాలేదు. అదే చంద్రబాబు చేసిన తప్పిదం. నేరుగా లోకేష్ మంత్రివర్గంలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా ప్రమోట్ అయ్యారు. అదే ఆయన రాజకీయ జీవితానికి చిన్నపాటి అడ్డంకిగా మారింది. రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. విపరీతమైన నెగిటివ్ ప్రచారం నడిచింది. అంతకుమించి లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సాహసంగా మారింది. 2019 ఎన్నికల్లో ఓటమి లోకేష్ రాజకీయ జీవితానికి ప్రమాదంలో పడేసింది.
Also Read : లోకేష్ టీం రెడీ.. ఎవరెవరు అంటే?
* లోకేష్ ఓటమితో ఇబ్బందులు
2014 ఎన్నికలకు ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా.. 2019 ఎన్నికల్లో మాత్రం లోకేష్ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబును ఇబ్బంది పెట్టింది. లోకేష్ ను వ్యక్తిత్వ హననం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) మాటల దాడి చేసింది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. అయినా సరే ఓడిపోయిన చోటే గెలుస్తానని చెప్పి.. మంగళగిరిలో తిరుగులేని మెజార్టీ సాధించారు లోకేష్. నాయకుడిగా ఆయనకు అది తిరుగులేని కిరీటం. అయితే అంతకుముందే లోకేష్ తన సమర్థతను నిరూపించుకున్నారు. సుదీర్ఘకాలం రాష్ట్రంలో యువ గళం పేరిట పాదయాత్ర చేశారు. అదే సమయంలో చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్టయ్యారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తండ్రి విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యం దెబ్బతినకుండా వ్యవహరించారు. కేంద్ర పెద్దలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమించారు. తనను తాను మలుచుకోవడమే కాక పార్టీకి మంచి ఊపు తెచ్చారు.
* ఇదే మంచి తరుణం..
ప్రస్తుతం లోకేష్ రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నం. ఏ నోటితో అయితే అసమర్థుడు, చేతకాని వాడు అంటూ కామెంట్స్ చేశారో.. అదే నోటితో లోకేష్ మామూలోడు కాదు అని అనిపించేలా లోకేష్ ప్రతాపం చూపుతున్నారు. అలాగని వాడుతున్న భాషలో ఎక్కడ లోపాలు వెలుగు చూడడం లేదు. మితిమీరిన భాషా ప్రయోగం లేదు. కేవలం హెచ్చరిక ధోరణితోనే ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. లోకేష్ అంటేనే భయపడేలా ప్రత్యర్థులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. 93 శాతం స్థానాలతో టీడీపీ ముందంజలో ఉంది. లోకేష్ మళ్లీ మంత్రి అయ్యారు. కూటమి కట్టడంతో డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే కూటమి కట్టుబాట్ల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాల్సి వచ్చింది. అందుకే లోకేష్ ప్రాధాన్యత పెంచాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ముందుగా పార్టీలో పదోన్నతి ఇవ్వాలని ఎక్కువమంది కోరుతున్నారు. ప్రస్తుతం లోకేష్ కు 42 ఏళ్లు. ఇప్పుడు కాకపోతే పదవి ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. పైగా భవిష్యత్తులో జగన్ రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు అదే జగన్ ఇలా కాలో జరుగుతున్న మహానాడు వేదికగా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి ప్రకటిస్తారని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఆనందపడుతున్నాయి. ఈరోజు చివరి రోజు మహానాడు జరుగుతుండడంతో.. లోకేష్ పేరు ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి